»   »  హాట్ న్యూస్ : ‘అత్తారింటికి దారేది’ స్టోరీ లీకైంది?

హాట్ న్యూస్ : ‘అత్తారింటికి దారేది’ స్టోరీ లీకైంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా 'అత్తారింటికి దారేది'చిత్రం స్టోరీ లీకైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా కొన్ని వివరాలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఆ వివరాల ప్రకారం ఈ సినిమాలో ప‌వ‌న్ పాత్ర రెండు షేడ్స్‌లో ఉంటుందని తెలుస్తోంది.

ఇదేనా ఆ స్టోరీ?
ప‌వ‌న్ ఒక మిలీయ‌నీర్‌. తాత‌య్య బొమ‌న్ ఇరానీతో క‌ల‌సి విదేశాల్లో ఉంటాడు. ఇండియాలో త‌న‌కో కుటుంబం ఉంద‌ని, ఓ అత్త‌య్య (న‌దియా) ఉందని తెలుస్తుంది. అయితే... త‌మ రెండు కుటుంబాల‌కూ ఓ త‌గాదా ఉంద‌ని కూడా అర్థ‌మ‌వుతుంది. దాన్ని తీర్చ‌డానికి ఇండియా వ‌స్తాడు. ఇక్క‌డ స‌మంత‌ని చూసి ఇష్ట‌ప‌డ‌తాడు.

ఇంత‌కీ స‌మంత‌ ఎవ‌రో కాదు.. స్వ‌యానా మ‌రద‌లు. అత్త‌య్య మ‌న‌సు మార్చ‌డానికి ఆ ఇంట్లోనే ప‌వ‌న్ డ్రైవ‌ర్‌గా చేర‌తాడు. ఆ త‌ర‌వాత ఏమైంది?? అనేదే ఈ సినిమా క‌థ‌. మిలియ‌నీర్ నుంచి డ్రైవ‌ర్‌గా మారిన ప‌వ‌న్ ప‌డే పాట్లూ, అత్త‌మ్మ‌ని దారిలోకి తెచ్చుకోవ‌డానికి చేసిన ప్ర‌య‌త్నాలు వినోదాత్మ‌కంగా ఉంటాయ‌ట.

మరి ఈ స్టోరీ నిజమైందా? కాదా? అనేది సినిమా విడుదలైతేకానీ చెప్పలేం. ఆ చిత్రం ఆడియో వేడుక శుక్రవారం(జులై 19)న హైదరాబాద్‌లో శిల్పకళా వేదికలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా కాలం తర్వాత పవర్ స్టార్ సినిమా ఆడియో వేడుక జరుగుతుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఆగస్టు 7న సినిమా విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లు. నదియా, బోమన్ ఇరానీ, బ్రహ్మానందం, అలీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లోకనిపించనున్నారు. సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary
After the track list of 'Attarintiki Daaredi' got out today, story of this flick has leaked seconds back and going viral everywhere in internet. Leaking aspects from a film is getting very common for star hero films and this is becoming new publicity strategy of film makers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu