పాన్ ఇండియా మూవీ కోసం నాని హార్డ్ వర్క్.. సిక్స్ ప్యాక్ అంటున్నారే?
టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ అందుకొని చాలా కాలమవుతోంది. వైవిధ్యమైన కథలతో ఆకట్టుకుంటున్నప్పటికి ఇంకా అనుకున్నంత స్థాయిలో న్యాచురల్ స్టార్ క్లిక్కవ్వడం లేదు. అయితే నాని సినిమా కోసం నిర్మాతలు బడ్జెట్ విషయంలో ఏ మాత్రం వెనుకాడడం లేదు. ఇక నెక్స్ట్ ఈ హీరో కూడా పాన్ ఇండియా సినిమాతో వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ సినిమా ఆగిపోలేదట..
గత కొన్ని రోజులుగా నాని నెక్స్ట్ సినిమాకు సంబంధించిన రూమర్స్ ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి. టాక్సివాలా దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తో ఒక సినిమా చేయడానికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. శ్యామ్ సింగరాయ్ అనే టైటిల్ ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగిపోయినట్లు రూమర్స్ వచ్చాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.

పాన్ ఇండియా ప్లాన్..
పిరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు బడ్జెట్ చాలానే ఖర్చయ్యే అవకాశం ఉంది కాబట్టి ఓకేసారి అన్ని భాషల్లో పాన్ ఇండియా మూవీ తరహాలో రిలీజ్ చేస్తే బావుంటుందని ఆలోచిస్తున్నారట. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తవ్వగా లాక్ డౌన్ అనంతరం సినిమాను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. అలాగే నటీనటులను కూడా దాదాపు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

నాని సిక్స్ ప్యాక్..
లాక్ డౌన్ లో నాని ఎక్కువగా వర్కవుట్ చేస్తూ సమయాన్ని గడుపుతున్నారట. నెక్స్ట్ సినిమాలో మరింత కొత్తగా కనిపించాలని బాడీ పెంచుతున్నాడట. ముఖ్యంగా సిక్స్ ప్యాక్ కోసం న్యాచురల్ స్టార్ చాలా కష్టపడుతున్నారనే టాక్ వస్తోంది. నాని ఇంతకుముందు ఏ సినిమాలో కనిపించని విధంగా శ్యామ్ సింగరాయ్ లో కనిపించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Recommended Video

మూడు సినిమాలు..
ప్రస్తుతం నాని చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. V సినిమా ఇప్పటికే రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇక లాక్ డౌన్ అనంతరం 'టక్ జగదీష్' షూటింగ్ కూడా ఊపందుకోనుంది. ఆ సినిమాకు నిన్ను కోరి దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహించనున్న విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత రాహుల్ డైరెక్షన్ లో శ్యామ్ సింగరాయ్ తెరకెక్కనుందట. మరి ఈ సినిమాలతో నాని ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











