నాగచైతన్య 'ఆటోనగర్‌ సూర్య' లీకైన డైలాగులు

By Srikanya

దేవ కట్టా దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందుతున్న చిత్రం 'ఆటోనగర్ సూర్య'. దేవకట్టాకు డైలాగ్స్ విషయంలో మంచి గ్రిప్ ఉందని గతంలో ప్రస్దానం నిరూపించింది. ఆ చిత్రంలో లోతైన భావమున్న డైలాగులుకు మంచి పేరు వచ్చింది. అలాగే ఈ చిత్రకు మొదట ఆడియో టీజర్ విడుదల చేసి మరీ క్రేజ్ క్రియేట్ చేసారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో లీకైనవంటూ నెట్ లో సంచరిస్తున్న డైలాగులు కొన్ని...

"చూడు బాబాయ్ కొట్టుకు చావటానికి మన మధ్య ఫ్యాక్షన్ గొడవలు లేవు,

భూమి మీద పుట్టిన ప్రతీ ఒక్కడికి ఒక హక్కు ఉంది ...తెలిసిన పని చేసుకుంటూ అడగడమ్...కానీ ఆ హక్కుని కబ్డా చేసుకుంటూ అడగడమ్ నీ హక్కు అనుకుంటున్నా..

హిస్టరీ లో జరిగిన ప్రతీ పోరాటానికి,యుద్దానికి ఇదే కారణం...

అవును బాబాయ్ నేను అనాధనే కానీ అనామకుడ్ని కాదు నా పేరు సూర్య...ఆటో నగర్ సూర్య..."

ఇక ఈ చిత్రంలో స్టోరీ లైన్ ఏమిటంటే... విజయవాడలో బెంజ్‌ సర్కిల్‌ ఎంత ఫేమసో... ఆటోనగర్‌ సూర్య కూడా అంతే. తనకు తెలిసిన పని చేసుకొంటూ... ఆ రంగంలో ఎదగాలనుకొనే రకం. ఒకరి హక్కును కబ్జా చేస్తే మాత్రం ఊరుకోడు. అందుకే సూర్య పేరు చెబితే రౌడీమూక గుండెల్లో కంగారు మొదలవుతుంది. ఇలాంటి మనస్తత్వమున్న సూర్య జీవితంలోకి ఎవరెవరు వచ్చారు? అతని ప్రయాణానికి అడ్డుగా నిలిచిన వారికి ఎలా బుద్ధిచెప్పాడు? తదితర విషయాలు తెలియాలంటే 'ఆటోనగర్‌ సూర్య' చిత్రం చూడాల్సిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా సమంత చేస్తోంది.

మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి నిర్మాత కె.అచ్చిరెడ్డి. ఈ చిత్రం వివరాలు ఆయన మీడియాకు తెలియచేస్తూ...దేవాకట్టా మంచి కథతో ఈ చిత్రాన్ని చేస్తున్నాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్న స్టయిలిష్ ఫిలిమ్ ఇది. హీరో క్యారెక్టర్ డిఫరెంట్ షేడ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నాగచైతన్యను పెద్దరేంజ్‌కి తీసుకువెళ్లే ప్రొటెన్షీయాలిటీ ఉన్న కథ ఇది. నిర్మాత వెంకట్‌కు కూడా ఈ కథ నచ్చడంతో చిత్రం నిర్మించడానికి పూనుకున్నాం అని వివరించారు.

హీరో నాగచైతన్య మాట్లాడుతూ దేవాకట్టా చెప్పిన కథ చాలా బాగుంది. నా పాత్ర అద్భుతంగా మలచడానికి ఆయన ప్రయత్నిస్తుండడంతో నేను ఈ చిత్రానికి చేయడానికి పూనుకున్నాను. హీరోగా నాకు మంచి చిత్రం అవుతుంది, అన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాను అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ ''కథాబలమున్న చిత్రమిది. యాక్షన్‌ నేపథ్యంలో సాగుతుంది. ప్రేమ, వినోదాంశాలకు ప్రాధాన్యముంది. నాగచైతన్యని ఓ సరికొత్త పాత్రలో చూపెట్టబోతున్నామ''అన్నారు.

ఈ చిత్రంలో సాయికుమార్‌ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. సంగీతం: అనూప్‌రూబెన్స్‌, సమర్పణ: ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X