నాగశౌర్యతో వర్కౌట్ అవుతుందా?.. అవసరాల ప్రయోగం
ఓ వైపు నటుడిగా .. మరో వైపు దర్శకుడిగా అవసరాల తన సత్తా చాటుకుంటున్నాడు. ఇటీవల నటనకి కాస్త గ్యాప్ ఇచ్చి దర్శకుడిగా ఓ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ కథను ఇప్పటి వరకు చాలా సినిమాల్లోనే చూసినట్టే అనిపించినా చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ఒక వ్యక్తి వివిధ దశల్లో ఒకే అమ్మయితో తన ప్రేమను ఎలా కొనసాగిస్తూ వస్తాడనేదే కథాంశమని టాక్.
ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి కావొస్తుందట.. అయితే కథ డిమాండ్ మేరకు అమెరికాలో కూడా షూట్ చేయాల్సి ఉందట. ఇక్కడి తీయాల్సిన సన్నివేశాలు అయిపోయాయని, త్వరలోనే యూనిట్ మొత్తం అమెరికాకు చెక్కేయబోతోందని తెలుస్తోంది. మరి ఈ చిత్రం శ్రీనివాస్ అవసరాల-నాగశౌర్య కాంబోలో ఉండే ఫీల్‌నే రీక్రియేట్ చేస్తుందో లేదో చూడాలి.

ఇంతకు ముందు వీరిద్దరి కాంబోలో వచ్చిన ఊహలు ఊహలు గుసగుసలాడే చిత్రం ఎంతటి ఘన విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. మరి ఈ కొత్త ప్రయోగం వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. నాగ శౌర్య ప్రస్తుతం అశ్వథ్థామ చిత్రంతో బిజీగా ఉన్నాడు. మొదటి సారి మాస్ లుక్‌ను ట్రై చేస్తూ... కొత్త జానర్‌ను ఎంచుకున్నాడు. ఈ మూవీ జనవరి 31న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











