‘అవును’హిందీ రీమేక్ లో స్టార్ హీరోయిన్

By Srikanya

హైదరాబాద్ : ఇటీవల విడుదలైన రవిబాబు'అవును' చిత్రం చిన్న చిత్రాలలో పెద్ద విజయం సాధించింది. ఈ చిత్రంతో దర్శకుడు రవిబాబు ప్రేక్షకులను బాగానే భయపెట్టగలిగాడు. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి అని తెలిసింది. అనుష్కశర్మ ఇందులో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నట్టు సమాచారం. రూ. 45 లక్షల వ్యవయంతో రూపొందిన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు రాబట్టింది. నిర్మాతలకు లాభాలను తెచ్చి పెట్టింది. ఈ సినిమా 'ఆయా'గా తమిళంలో అనువాదమవుతోంది.

వైవిద్యమైన కథలతో ఓ బ్రాండ్ గా మారిన రవిబాబు తాజా చిత్రం 'అవును'. ఎంటర్మెంమెంట్ విత్ థ్రిల్లర్, హారర్ గా రూపొందిన ఈ చిత్రం ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే నమోదు చేసింది. హీరోయిన్ యామి గౌతమి జీవితంలో జరిగిన ఓ రియల్ సంఘటన ఆధారంగా ఈచిత్రాన్ని తెరకెక్కించాని అని చెప్తున్న ఈ చిత్రం ఒకే ఒక పోస్టర్ తో అంతటా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ చిత్రంలో పాటలు లేవు. పాటలు కథనాన్ని దెబ్బ తీస్తాయని పెట్టలేదని చెప్తున్నారు. చిత్రం గంటా 50 నిముషాలు పాటు ఉత్కంఠను కలిగిస్తూ సాగుతుంది. దాదాపు 25 నిముషాలు పాటు వచ్చే గ్రాఫిక్ వర్క్ అలరిస్తుంది.

కొత్తగా పెళ్లైన ఓ జంట ఓ ఇంట్లోకి షిప్ట్ అయినప్పుడు ఏం జరిగింది అనే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు... మనతోపాటు ఎవరో ఉన్నారు, కానీ వాళ్లెవరో తెలియడం లేదు, కనిపించడం లేదు అనే భావన కలిగిన వెంటనే వెన్నులో వణుకుపుడుతుంది కదా. ఈ కథలోనూ అంతే. హీరోయిన్ కి అలాంటి అనుభవాలే ఎదురవుతాయి. విలన్‌ ఉన్నాడు... కానీ కనిపించడు. అతని బారి నుంచి ఎలా తప్పించుకుందన్నదే అసలు కథ.

రవిబాబు మాట్లాడుతూ...ఈ చిత్రంలో చీకటి నేపథ్యం లేదు. ఆత్మలు పగలే, మంచి కాంతివంతమైన వాతావరణంలో కంగారు పుట్టిస్తాయి. భయపడటం కూడా వినోదంలో భాగమే. వంద మంది మధ్యలో కూర్చొని కూడా... తెరపైన సన్నివేశాలకు అనుగుణంగా స్పందిస్తూ భయపడటం... థియేటర్‌ బయటకు వచ్చాక దాని గురించి మాట్లాడుకోవడం సరదాగా అనిపిస్తుంది. అందుకే థ్రిల్లర్‌, హారర్‌ తరహా చిత్రాలకు ఆదరణ ఉంటోంది అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X