twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రవిబాబు ‘అవును’ హిందీ రీమేక్?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : రొటీన్‌కి భిన్నంగా తెలుగు సినిమాలు తీసే దర్శకుడు రవిబాబు ఇటీవల 'అవును' అనే సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ హారర్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రూ. 45 లక్షల వ్యవయంతో రూపొందిన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు రాబట్టింది. నిర్మాతలకు లాభాలను తెచ్చి పెట్టింది.

    తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పలు బాలీవుడ్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ కంపెనీలు రవిబాబును సంప్రదించి రీమేక్ హక్కుల కోసం ప్రయత్నించినట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీరానుంది.

    'అవును'చిత్రం హీరోయిన్ యామి గౌతమి జీవితంలో జరిగిన ఓ రియల్ సంఘటన ఆధారంగా ఈచిత్రాన్ని తెరకెక్కించారు. పూర్ణ, హర్షవర్ధన్‌రాణె, ఎవిఎస్‌ అల్లుడు చక్రవర్తి, భార్గవి, చలపతిరావు, ఢిల్లీ రాజేశ్వరి, మాస్టర్‌ గౌరవ్‌ తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషించారు.

    సినిమా కథ విషయానికొస్తే...కొత్తగా పెళ్లైన మోహిని ఆమె భర్త హర్ష హైదరాబాద్ గండిపేట దగ్గరలో 'క్లాసిక్ హోమ్స్'లో దిగుతాడు. అయితే ఆ ఇంటిలోకి చేరిన దగ్గరనుంచి రకరకాల వింత అనుభవాలు ఎదురౌతుంటాయి. ముఖ్యంగా ఆమెను ఎవరో వెనక నుంచి గమనిస్తున్నట్లు, తను బట్టలు మార్చుకునేటప్పుడు ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్లు ఫీలవుతూంటుంది. ఈ నేపథ్యంలో చనిపోయిన తన తాతతో మాట్లాడే... ప్రక్కింటి పిల్లాడు విక్కి ద్వారా తమ ఇంట్లో కెప్టెన్ రావు ఆత్మ ఉన్నట్లు తెలుసుకుంటారు. అయితే ఈలోగా ఈ తల నొప్పులు నుంచి తప్పించుకోవటానికి ప్యారిస్ కు హానీమూన్ ట్రిప్ ఏర్పాటు చేసుకుంటారు. అయితే అప్పటినుంచి ఆ ఆత్మ తన విశ్వరూపం చూపెడుతుంది. ఈ నేపథ్యంలో ఆ జంట ఏం చేసింది అనేది క్లుప్తంగా ఈచిత్రం కథాంశం.

    English summary
    
 Ravi Babu’s recent suspense thriller Avunu might be remade in Bollywood, if all goes well. The film, which was made on a budget of Rs 45 lakhs, did astonishingly well at box office which came as a big surprise to even the director. Soon after the film’s teasers were unveiled, several Bollywood production houses approached Ravi Babu for the remake rights and the talks are still on with few companies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X