ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిన 'ఇంద్ర' దర్శకుడికి రెమ్యునరేషన్ లేదట..?
టాలీవుడ్ సీనియర్ దర్శకుడు బి.గోపాల్ అంటే తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. నరసింహా నాయుడు, ఇంద్ర వంటి ఎన్నో బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న ఆయన ఒకప్పుడు జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసేవారు. ఒకేసారి రెండు మూడు సినిమాలను డైరెక్ట్ చేసిన బి.గోపాల్ గారికి ఇప్పుడు ఒక్క అవకాశం దొరకడమే కష్టంగా మారింది.
ఆ మధ్య గోపిచంద్ హీరోగా ఆయన డైరెక్ట్ చేసిన ఆరడుగుల బుల్లెట్ కనీసం విడుదలకు కూడా నోచుకోలేదు అంటే ఆయన పరిస్థితి ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు. అయితే ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని బాలయ్యతో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫిక్స్ చేసుకున్నాడు ఈ సీనియర్ దర్శకుడు. ఇప్పటికే రైటర్ సాయి మాధవ్ బుర్ర వీరి కోసం మాస్ కథను రెడీ చేశాడు. అయితే ఆ సినిమా కోసం బి.గోపాల్ ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదట.

ఇంద్ర సినిమా సమయంలో అందరికంటే ఎక్కువ పారితోషికం అందుకున్న బి.గోపాల్ ఇప్పుడు ఏ మాత్రం తీసుకోకపోవడం గమనార్హం. సినిమా రిలీజ్ తరువాత లాభాలని బట్టి ఒక ఎమౌంట్ ఇస్తామని నిర్మాతలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. వరుసగా ఫెయిల్యూర్స్ రావడంతో డీలా పడ్డ బి.గోపాల్ మరోసారి బాలయ్యతో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి. వీరి కాంబినేషన్ రానున్న ప్రాజెక్ట్ ఆగస్ట్ లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











