వెంకి హిట్ చిత్రం రీమేక్ లో అక్షయ్ కుమార్

By Srikanya

హైదరాబాద్ :బాలివుడ్ దృష్టి అంతా గత కొంత కాలంగా టాలీవుడ్ హిట్ చిత్రాలపై ఉంది. ముఖ్యంగా సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ వంటి హీరోలు ఇదే పనిపై ఉన్నారు. రౌడీ రాధోడ్(విక్రమార్కుడు) చిత్రం హిట్ అవటంతో అక్షయ్ కుమార్ తెలుగు చిత్రాలపై కన్నేసారు. తాజాగా ఆయన బలుపు, ఎవడు సినిమాలు చూసారు ..రెండూ ఇంప్రెస్ చేయలేకపోవటంతో వెంకటేష్ గతంలో చేసి హిట్టయిన 'లక్ష్మి' చిత్రం ని రీమేక్ చేద్దామని నిర్ణయించుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 'లక్ష్మి' చిత్రంలో వెంకటేష్, ఛార్మి, నయనతార నటించారు. వి వి వినాయిక్ దర్శకత్వం వహించారు.

'లక్ష్మి' కథేమిటంటే...

B-town star in Venky's Laxmi shoes?

లక్ష్మీ ఇండస్ట్రీస్‌ ఎండి లక్ష్మీనారాయణ (వెంకటేష్‌) వురప్‌ లక్ష్మి అంటే అటు కుటుంబంలోనే కాకుండా ఇటు కార్మికుల్లోనూ ఎనలేని అభిమానం. నిజాయితీకి విలువనిస్తూ తండ్రిలేని తన కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. ఇద్దరు చెల్లెల్లు, ఇద్దరు తమ్ముళ్లు (సర్వానంద్‌, రాజీవ్‌ కనకాల) అతని క్రమశిక్షణకు చిరాకు పడినా బయటపడరు. అలాంటి పచ్చని కాపురంలో చిచ్చు పెట్టడానికి జనార్దన్‌ రావు (సాహిజీ షిండే) అనే విలన్‌ బయలుదేరుతాడు. జనార్దన్‌ రావు గతంలో ఫోర్జరీ నేరంపై లక్ష్మి చేత ఫ్యాక్టరీ నుండి గెంటివేయబడ్డ ఉద్యోగి.

అతను పగ తీర్చుకోవడానికి రొటీన్‌గా లక్ష్మీ తమ్మున్ని చేరదీసి వ్యసనాలకు అలవాటు చేస్తుంటాడు. విషయం తెలిసిన లక్ష్మీ వార్నింగ్‌ ఇస్తాడు. మరో పక్క లక్ష్మి తన చిన్న చెల్లెలను వేరుగా తక్కువగా చేసి చూస్తుంటాడు. పెద్ద చెల్లెలు పెండ్లికి కోట్లలో ఖర్చు చేస్తే చిన్న చెల్లెలి పెళ్లికి ఎక్కువ కట్నం ఇవ్వడానికి నిరాకరిస్తాడు. బాధతో ఎదురు తిరిగిన చెల్లెలికి తాను అలా ఎందుకు చేయవలసి వచ్చిందో గతాన్ని విప్పి వివరిస్తాడు. తాను, ఆమె ఆ కుటుంబంలో రక్తసంబంధం లేని వ్యక్తులమని, అనాథలమని తెలియజేస్తాడు.

విషయం తెలిసిన తమ్ముళ్లు లక్ష్మీని ఇంటి నుండి బయటకు గెంటేస్తారు. మరోపక్క లక్ష్మి కోసం కలకత్తా డాన్‌ ప్రదీప్‌ రావత్‌ నిద్రాహారాలు మాని వెతుకుతుంటాడు. శైలజ (చార్మి) లక్ష్మీని మూగగా ఆరాధిస్తూ పాటలు పాడుకుంటుంది. ఇంకో చోట నయన తార ఆస్పత్రిలో కోమాలో ఉంటుంది. ఆమె ఫ్లాష్‌ బ్యాక్‌ ఏమిటి? లక్ష్మి తను ప్రేమించిన కుటుంబంలో సభ్యుడిగా చేరుతాడా అనేది తెరపై చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X