ఎన్టీఆర్ 'బాద్‌షా' కి మరోసారి కెమెరామెన్ ఛేంజ్
హైదరాబాద్: ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం బాద్షా. ఈ చిత్రంకి కెమెరామెన్ మరోసారి మారి టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా మారింది. మొదట ఈ చిత్రానికి ఆండ్రూని అనుకున్నారు. ఆడ్రూ చేసిన కందిరాగ,ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాలలో ఛాయా గ్రహణం చూసి ఈ ఆఫర్ ఇచ్చారు. అయితే ఇటలీ షెడ్యూల్ అయిన తర్వాత ఆయన వర్కింగ్ స్టైల్ నచ్చలేదని వద్దన్నారు. ఆ తర్వాత ఆప్లేస్ లోకి జయన్ విన్సెంట్ వచ్చారు. గబ్బర్ సింగ్ వర్క్ నచ్చిన శ్రీను వైట్ల ఆయన్ను తన టీమ్ లోకి తీసుకున్నారు.
అయితే ఇప్పుడు ఆయన్ను కూడా కాదన్నట్లు సమాచారం. బ్యాంకాక్ షెడ్యూల్ లో ఆయన వర్క్ స్టైల్ నచ్చలేదని వద్దన్నట్లు వార్తలు వినపడుతున్నాయి. ఆ ప్లేస్ లోకి ఆర్.డి. రాజశేఖర్ ని తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రంకంగా ఈ చిత్రానికి మూడో కెమెరామెన్ ఆర్.డి.రాజశేఖర్ అవుతారు. ఇక గతంలో కూడా దూకుడు సమయంలో కూడా కెమెరామెన్ మార్పు జరిగింది. దాదాపు సెవెంటీ పర్శంట్ షూటింగ్ జరిగిన తర్వాత అప్పటి వరకూ పనిచేసిన ప్రసాద్ మూరెళ్లని కాదని, కెవి గుహన్ ని సీన్ లోకి తీసుకు వచ్చారు. గుహన్ గతంలో మహేష్ తో పని చేసి ఉన్నారు.
ఇవన్నీ ఎలా ఉన్నా ఈ చిత్రం గ్యారెంటీగా ఎన్టీఆర్ కు సూపర్ హిట్ ఇస్తుందంటున్నారు. ఈ విషయమై నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ... ''వినోదాత్మకమైన కథ ఇది. ఎన్టీఆర్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఉంటుంది. హైదరాబాద్ పరిసరాల్లోనే షూటింగ్ త్వరలో మొదలుపెడతాం. సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. తమన్ బాణీలు హుషారుగా సాగిపోతాయి''అని చెప్పారు. వినోదాన్ని యాక్షన్ కథల్లో మేళవించే దర్శకుడు శ్రీను వైట్ల. కథానాయకుడి చేత పోరాటాలతో హంగామా చేయిస్తారు... వినోదమూ పండిస్తారు. ఈ తరహా పాత్రల్లో ఒదిగిపోయేడు హీరో ఎన్టీఆర్. వీరిద్దరి కలయికలో 'బాద్‌షా' తెరకెక్కుతోంది. కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఎన్టీఆర్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ... సినిమా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అన్నారు. శ్రీను వైట్ల, ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే జనం రకరకాలు అంచనాలు వేస్తున్నారు. వాటినన్నిటికీ అతీతంగా కథ, కథనం ఉంటాయి. పూర్తిగ మొదటినుంచి చివరి వరకూ పొట్ట పగిలేలా నవ్విస్తాము అన్నారు. గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ కొట్టిన గణేష్, దూకుడుతో సూపర్ హిట్ కొట్టిన శ్రీనువైట్ల కాంబినేష్ కాబట్టి తమకీ ఆ రేంజి హిట్ పడుతుందని ఎన్టీఆర్ పూర్తి నమ్మకంగా ఉన్నారు. ట్రేడ్ లో సైతం ఆ నమ్మకంతో హైప్ క్రియేట్ అవుతోంది.


Click it and Unblock the Notifications











