ఎన్టీఆర్ 'బాద్‌షా' మరిన్ని (లీక్) డైలాగ్స్
హైదరాబాద్ : ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం 'బాద్‌షా'. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చాలా పవర్ ఫుల్ డైలాగులు ఉండబోతున్నాయనే సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం లో రాబోయే డైలాగు అంటూ కొన్ని ప్రచారంలో కి వచ్చి ఆదరణ పొందుతున్నాయి. అవేమిటంటే..
1) "శతృవుకి షేర్షా.... స్నేహానికి బానిస.... .... స్టేట్ కి బాద్షా".
2) ' బ్రతకాలి అంటే బాద్షా వెనక ఉండాలి, చావాలనుకుంటే బాద్షా ముందు ఉండాలి '
3) 'కలకాలం ఉండాలి అనిపిస్తే ఉండు, కానీ కైలాసం వరకూ వెళ్లాలనుకుంటే నాతో పెట్టుకో '
ఇక ఈ డైలాగ్స్ ఈ చిత్రంలో ఉన్నాయో లేవో కానీ సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో బాగా పాపులర్ అవుతున్నాయి. అయితే సినిమాలో వదిలే డైలాగు మాత్రం చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని మాత్రం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే...టీజర్ తో వదిలిన
" 'బాద్‌షా' డిసైడ్ అయితే ....వార్ వన్ సైడ్ అవ్వుద్ది " అనే డైలాగు చాలా బాగా జనాల్లోకి దూసుకుపోయింది. దాంతో కొందరు ఫ్యాన్స్ కూడా తమకు నచ్చిన డైలాగులను స్వంంతంగా రాసి ప్రచారంలోకి తెస్తున్నారు.
ఇక దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల నేపథ్యంలో సెక్యూరిటీ కారణాల వల్ల ఈ నెల 10న జరుగాల్సిన జూ ఎన్టీఆర్ తాజా మూవీ 'బాద్ షా' ఆడియో వేడుక వాయిదా పడిన విషయం తెలిసింతే. తాజాగా ఆడియో వేడుక తేదీ ఖరారు చేసారు. ఈ నెల 17న నానక్‌రాంగూడ రామానాయుడు స్టూడియోలో వేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
శివరాత్రి సందర్భంగా ఈ నెల 10న రామానాయుడు స్టూడియోలోనే ఆడియో వేడుక నిర్వహించాలని ముందుగా అనుకున్నారు. అయితే ఉగ్రవాదులు శివరాత్రి రోజున పలు దేవాలయాలను టార్గెట్ చేసుకుని విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉన్నట్లు ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ రావడం....ఆ రోజు 'బాద్ షా' ఆడియో వేడుకకు సెక్యూరిటీ సమస్య కారణాలను చూపి అనుమతి నిరాకరించారు పోలీసులు.
తాజాగా పోలీసులు అనుమతితోనే ఈ నెల 17న అదే లొకేసన్లో బాద్ షా ఆడియో వేడుక నిర్వహించాలని నిర్ణయించారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ఈ ఆడియో వేడుకజరుగనుంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ బేనర్‌పై బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూ ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











