twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్ : ఎన్టీఆర్ 'బాద్‌షా' లీక్ డైలాగ్

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'బాద్‌షా'. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చాలా పవర్ ఫుల్ డైలాగులు ఉండబోతున్నాయని వినికిడి. తాజాగా ఈ చిత్రం లో రాబోయే డైలాగు అంటూ ఒకటి ప్రచారంలో కి వచ్చింది. అదేమిటంటే.. విలన్ హీరోని చూస్తూ.. ఎవరు నువ్వు అన్నట్లు అడుగుతాడు.

    దానికి ఎన్టీఆర్ సమాధానంగా..... "శతృవుకి షేర్షా.... స్నేహానికి బానిస.... .... స్టేట్ కి బాద్షా".

    ఇక ఈ డైలాగు ఈ చిత్రంలో ఉందో లేదో కానీ సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో బాగా పాపులర్ అవుతోంది. అయితే సినిమాలో వదిలే డైలాగు మాత్రం చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని మాత్రం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే...టీజర్ తో వదిలిన
    " 'బాద్‌షా' డిసైడ్ అయితే ....వార్ వన్ సైడ్ అవ్వుద్ది " అనే డైలాగు చాలా బాగా జనాల్లోకి దూసుకుపోయింది. దాంతో కొందరు ఫ్యాన్స్ కూడా తమకు నచ్చిన డైలాగులను స్వంంతంగా రాసి ప్రచారంలోకి తెస్తున్నారు.

    హీరోల ఇమేజ్‌కి తగ్గ రీతిలో కథలను ఎంచుకోవడం, వారిలోని మాస్ యాంగిల్‌ని అద్భుతంగా వినియోగించుకోవడం, తనదైన శైలిలో రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తడం... ఇదీ దర్శకుడు శ్రీనువైట్ల స్టైల్. అందుకు ఆయన గత చిత్రాలే ఉదాహరణ. శ్రీనువైట్ల గత చిత్రం 'దూకుడు' బాక్సాఫీస్ దగ్గర చేసిన హల్‌చల్ అంతాఇంతా కాదు. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్‌తో 'బాద్‌షా' లో ఈ మ్యాజిక్ జరుగుతుందంటున్నారు. కాజల్ అగర్వాల్ ఇందులో హీరోయిన్ . బండ్ల గణేష్ నిర్మాత.

    జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 'బాద్ షా' ఆడియో హక్కుల్ని ఆదిత్య మ్యూజిక్ దక్కించుకుంది. 'బాద్ షా' ఆడియో కార్యక్రమం మార్చి 10 తేదిన జరుగనుంది. ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులను 'బాద్ షా' పాటలు ఆకట్టుకునే విధంగా తమన్ సంగీతాన్ని అందించారని ఆదిత్య మ్యూజిక్ ఎండీ ఉమేష్ గుప్తా తెలిపారు.

    English summary
    NTR’s upcoming film ‘Baadshah’. A dialogue from the film has been leaked and it has already become a big hit among the fans. When the villain asks to NTR that who is he? NTR replies “Satruvulaki Shershah... Snehaniki Baanisa.... State Ki BAADSHAH”.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X