హాట్ టాపిక్ :‘బాద్ షా’శాటిలైట్ రైట్స్ రేటు

By Srikanya

హైదరాబాద్ : బిజినెస్ వర్గాల్లో సంచలనం క్రియేట్ చేస్తున్న చిత్రం 'బాద్ షా'. శ్రీను వైట్ల దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంభందించి శాటిలైట్ రైట్స్ ఫైనల్ అయ్యాయని తెలుస్తోంది. అయితే ఓ ధర్డ్ ఫార్టీ ఈ రైట్స్ ని కొనుగోలు చేసిందని సమాచారం. ఆ రేటు ఏడు కోట్ల యాభై లక్షలు పలికిందని తెలుస్తోంది. ధర్డ్ పార్టీ వారు తర్వాత మరో రేటుకు టీవీ ఛానెల్స్ కు అమ్ముకుంటారు. ఇప్పటికే ఈ చిత్రం హక్కులు దక్కించుకునేందుకు రెండు పాపులర్ టీవీ ఛానల్స్ పోటీ పడుతున్నాయి. దాంతో మధ్యరకంగా ఈ రేటుకి ఫిక్స్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది.

కాజల్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసరాల్లో షూటింగ్ సాగుతోంది. హీరోయిన్ తోపాటు ఎమ్మెస్‌ నారాయణ, వెన్నెల కిషోర్‌ తదితరులపై వినోద ప్రధానమైన సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలు సినిమాలో కీలకమై నిలుస్తాయని చెప్తున్నారు. ఎన్టీఆర్ పూర్తి కాన్పిడెంట్ గా హిట్ కొడతానని చెప్తున్న ఈ చిత్రం టీజర్ ని క్రిందటి నెల 24న 'బాద్‌షా' విడుదల చేసారు. టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

నిర్మాత బండ్ల గణేష్‌ మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌ నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలూ రంగరించిన కథ ఇది. ఆయన నటన, గెటప్స్‌ ఆకట్టుకొంటాయి. హీరోయిజాన్ని పతాక స్థాయిలో చూపిస్తున్నారు దర్శకుడు. ఇటీవలే విదేశాల్లో పోరాట ఘట్టాల్నీ, సన్నివేశాల్ని చిత్రించాుర. అవి చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి'' అన్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పాత్ర కూడా డిఫెరెంట్ గా ఉంటుంది. ఆ పాత్ర గురించి చెబుతూ నిర్మాత బండ్ల గణేష్...సేవకుడిగా కాదు.... పాలకుడిగా బతకడమే అతనికిష్టం. బుల్లెట్‌లా కాదు, దాని లక్ష్యాన్ని శాసించే ట్రిగ్గర్‌లా ఉండడమే అతనికిష్టం. అందుకే తనకు తానే 'బాద్‌షా' అని ప్రకటించుకొన్నాడు. ఇంతకీ ఎవరతను? అతని లక్ష్యమేమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు బండ్ల గణేష్‌.

'బాద్ షా' నాన్ స్టాప్‌గా డిసెంబర్ వరకు జరిగే షూటింగుతో టోటల్ షూటింగ్ పూర్తవుతుంది. డిసెంబర్ కల్లా షూటింగ్ పార్టు పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ పనులు మొదలు కానున్నాయి. అదే నెలలో ఆడియో విడుదల కానుంది. సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, గోపీ మోహన్, కోన వెంకట్ స్క్రిప్టు రచయితులగా పని చేస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు ఇతర సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X