twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిజమా ? : ఎన్టీఆర్ 'బాద్‌షా' కి కోతలు

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'బాద్‌షా'. మొన్న శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ఓ రేంజి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అయితే లెంగ్త్ ఎక్కువైందని టాక్ రావటడంతో సినిమాని ట్రిమ్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. సినిమా ప్రస్తుతం రెండు గంటల నలభై నిముషాలు ఉంది. సెకండాఫ్ లో కొన్ని సీన్స్ కు కత్తెర వేసి, దాన్ని మరింత షార్ప్ గా చేయాలని దర్శక,నిర్మాతలు భావించినట్లు ఫిల్మ్ నగర్ టాక్. అయితే ఈ విషయమై అథికారిక ప్రకటన ఏదీ లేదు.

    'బాద్ షా' చిత్రం యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద ఫస్ట్ వీకెండ్ ఫెంటాస్టిక్ కలెక్షన్స్ సాధించింది. యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టెనర్‌గా రూపొందిన ఈచిత్రం అమెరికా బాక్సాఫీసు చార్ట్ లో టాప్ పొజిషన్ దక్కించుకుంది. 'బాద్ షా' చిత్రం రికార్డు స్థాయిలో అమెరికాలో 117 థియేటర్లలో విడుదలైంది. దీనికి తోడు సినిమాకు పాజిటివ్ రివ్యూలు రావడం, హిట్ టాక్, గుడ్ ఎంటర్టెనర్ అని మౌత్ టాక్ రావడంతో సినిమా బిజినెస్ ఊపందుకుంది. దీంతో కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం 1 మిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఈచిత్రం తొలి వీకెండ్(గురు, శుక్ర, శని, ఆది) రూ. 5.70 కోట్లు ($10,45,192) వసూలు చేసింది.

    గతంలో 'గబ్బర్ సింగ్' మూవీ ఫస్ట్ వీకెండ్ రికార్డ్ రూ. 4.13 కోట్లను ($7,65,373) వసూలు చేయగా....'బాద్ షా' ఆ రికార్డును అధిగమించింది. అయితే 'బాద్ షా' చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రికార్డును మాత్రం బద్దలు కొట్టడంలో విఫలమైంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం 69 స్ర్కీన్లలో విడుదలై ఫస్ట్ వీకెండ్ రూ. 6.87 కోట్లు ($12,62,100) వసూలు చేసింది.

    శ్రీను వైట్ల మాట్లాడుతూ... ''దూకుడు తరవాత చేస్తున్న చిత్రం కాబట్టి అంచనాలు బాగా పెరిగాయి. దాంతో నాపై ఒత్తిడి ఎక్కువైంది. 'బాద్‌షా' కోసం పడిన ఏడాది కష్టాన్ని మర్చిపోయేలా చేసింది... ప్రేక్షకుల స్పందన. నేను నమ్ముకున్న వినోదమే నాకు వరుస విజయాల్ని అందిస్తుంది. స్పందన తెలుసుకొని ఎన్టీఆర్‌ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.'' అన్నారు.

    English summary
    Junior NTR's latest outing Baadshah trimmed down 15 minutes. which has been directed by Srinu Vaitla, has done fantastic collection at the USA Box Office in the first weekend. The masala entertainer has topped the business chart in the country, beating new Bollywood release Chashme Baddoor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X