»   » 300 కోట్లు నష్టం?: బాహుబలి-2 టీంను టెన్షన్లో పడేసిన రాజమౌళి

300 కోట్లు నష్టం?: బాహుబలి-2 టీంను టెన్షన్లో పడేసిన రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా చిత్రీకరణ విషయంలో ఏ మాత్రం చిన్న తప్పు జరిగినా నష్టం కోట్లలో ఉంటుంది. అనుకున్న విధంగా చిత్రీకరణ జరుగక పోయినా, ఔట్ పుట్ సంతృప్తికరంగా లేక పోయినా..... మళ్లీ కోట్లు ఖర్చు పెట్టి రీషూట్ చేయాల్సిందే. గతంలో చాలా సినిమాల విషయంలో ఇలాంటి తప్పులు జరిగాయి. ఇలాంటి పర్యవసానాలకు పూర్తి బాధ్యత వహించాల్సింది దర్శకుడే.

తాజాగా 'బాహుబలి-2' విషయంలో కూడా ఇలానే జరిగిందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు చిత్రీకరణ జరిపిన దానిపై రాజమౌళి సంతృప్తిగా లేరని, రీషూట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని ఫిలిం వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బాహుబలి భారీ బడ్జెట్ ప్రాజెక్టు కాబట్టి....రీషూట్ చేయాలంటే దాదాపు రూ.30 కోట్ల వరకూ అదనంగా ఖర్చు అవుతుందట.

Baahubali 2 Reshoot?

రాజమౌళి నిర్ణయంతో అటు నిర్మాతలలు, ఇటు చిత్ర టీం టెన్షన్‌ పడుతున్నట్లు సమాచారం. అయితే రాజమౌళి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రీషూట్ తప్పనిసరి అని తేల్చి చెప్పాడట..... ఇపుడు 30 కోట్ల కోసం వెనకాడితే సినిమా రేపు 300 కోట్లు నష్టపోవాల్సి వస్తుంది ఖరాకండిగా చెప్పేసారట.

'బాహుబలి' ఫస్ట్ పార్ట్ విషయంలో కొన్ని విమర్శలు వచ్చాయి. అందుకే సెకండ్ పార్ట్ విషయంలో రాజమౌళి చాలా కేర్ తీసుకుంటున్నారు. ఎలాంటి విమర్శలకు చోటివ్వకుండా సెకండ్ పార్ట్‌ని పూర్తిచేయాలని రాజమౌళి భావిస్తున్నారు. అందుకే ఆయన ఏ చిన్న లోపాన్ని కూడా లైట్ గా తీసుకోవడం లేదని టాక్. రాజమౌళి ఇలా ప్రతి విషయంలో పర్‌ఫెక్టుగా ఉంటారు కాబట్టే ఆయన సక్సెస్ ఫుల్ దర్శకుడు అయ్యారు అని అంటుంటారు.

English summary
Film Nagar source siad that, Baahubali 2 team planning to reshoot the scenes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu