పవన్ కళ్యాణ్ బిగ్ బడ్జెట్ మూవీ కోసం బాహుబలి బ్యూటీ.. ఎందుకంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల తరువాత సినిమాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నాడు. ఓ వైపు రాజకీయాలకు సంబంధించిన విషయాలపై స్పందిస్తూనే మరో వైపు సినిమాల గురించి కూడా చర్చలు జరుపుతున్నారు. అయితే ఎక్కువగా పవన్ సినిమా బాధ్యతలను దర్శక నిర్మాతలపైనే వేస్తున్నారు. దీంతో చిత్ర యూనిట్ సభ్యులు కూడా పవన్ ఇచ్చిన ఫ్రీడమ్ ని ఏ మాత్రం చెడగొట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Recommended Video

Pawan Kalyan Didn't Use Even Caravan while Movie Shootings
వకీల్ సాబ్ ఎప్పుడంటే..

వకీల్ సాబ్ ఎప్పుడంటే..

మొదట పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ వకీల్ సాబ్ ని లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగానే నెలకొన్నాయి. దాదాపు ఆ సినిమా షూటింగ్ పనులు ఎండింగ్ లోనే ఉన్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా అయిపోతే సినిమా రిలీజ్ డేట్ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. లాక్ డౌన్ తరువాత సమ్మర్ ఎండింగ్ లో పరిస్థితులను బట్టి సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.

క్రిష్ సినిమా ఎంతవరకు వచ్చింది..?

క్రిష్ సినిమా ఎంతవరకు వచ్చింది..?

పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబినేషన్ లో ఒక పిరియాడిక్ సినిమా సిద్దమవుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు క్రిష్ స్క్రిప్ట్ పనులను ఎప్పుడో ఫినిష్ చేశాడు. పవన్ కళ్యాణ్ లుక్ కూడా సిద్ధమైంది. ఇక షూటింగ్ స్పీడ్ పెంచుదామనుకున్న సమయంలో సడన్ గా బ్రేకులు పడ్డాయి. అయితే ఆ సినిమాలో ఇంకా చాలా మంది నటీనటులను ఫైనల్ చేయాల్సి ఉంది. ఆ విషయంలో ఇంతవరకు ఒక క్లారిటికి రాలేదు.

ఆ పాత్ర కోసం బాహుబలి బ్యూటీ..

ఆ పాత్ర కోసం బాహుబలి బ్యూటీ..

బాహుబలి బ్యూటీ అనుష్క శెట్టి మొట్ట మొదటిసారి పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక పవర్ఫుల్ లేడి వారియర్ పాత్ర కోసం గత కొంతకాలంగా చాలా మంది హీరోయిన్స్ ని అనుకున్నారట. ఎవరు కూడా సెట్ కాకపోవడంతో ఫైనల్ గా బాహుబలి దేవసేనని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

త్వరలో గుడ్ న్యూస్..

త్వరలో గుడ్ న్యూస్..

వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్ట్ పై ఆడియెన్స్ కి ఒక ఫస్ట్ లుక్ తో క్లారిటీ ఇవ్వాలని దర్శకుడు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆ సర్ ప్రైజ్ ఎలా ఉంటుందో చూడాలి మరి. ఇక కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ సినిమాను శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ లో ఖుషి నిర్మాత ఎఎమ్.రత్నం నిర్మిస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ కొత్త షెడ్యూల్ ని ప్లాన్ చేసుకుంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X