షాకింగ్: బాహుబలికి ధీటుగా పవన్, త్రివిక్రమ్ సినిమా బిజినెస్..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే ఆ చిత్రానికి ఎక్కడ లేనంత క్రేజ్ వస్తుంది. కలెక్షన్లపరంగా బాక్సాఫీస్‌ను కుమ్మెస్తాయి. వారి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే ఆ చిత్రానికి ఎక్కడ లేనంత క్రేజ్ వస్తుంది. కలెక్షన్లపరంగా బాక్సాఫీస్‌ను కుమ్మెస్తాయి. వారి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు జల్సా, అత్తారింటికి దారేది అందుకు రుజువు. ఇక అత్తారింటికి దారేది చిత్రం తొలిసారి తెలుగు సినిమాను వంద కోట్ల క్లబ్‌లో చేర్చింది. ప్రస్తుతం పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం విడుదలకు ముందే రికార్డు స్థాయి బిజినెస్ చేసినట్టు వార్తలు వెలువడుతున్నాయి.

150 కోట్లకు పైగా బిజినెస్
త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో పవన్ కల్యాణ్ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ పాత్రను పోషిస్తున్నారు. పవన్ సరసన ఈ చిత్రంలో మలయాళ ముద్దుగుమ్మలు కీర్తీ సురేష్, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదు. కానీ ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం రూ. 150 కోట్లకుపైగా జరిగినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు ప్రీ రిలీజ్ బిజినెస్ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఏరియా వారీగా రికార్డు
ఈ చిత్రానికి సంబంధించిన ఏరియా హక్కుల బిజినెస్ రికార్డు స్థాయిలో ఉన్నట్టు సమాచారం. నైజాం ఏరియాను రూ.32 కోట్లకు, సీడెడ్‌లో సుమారు రూ.18 కోట్లకు, ఆంధ్ర ఏరియాను రూ.45 కోట్లకు పైగానే పలికినట్టు తెలుస్తున్నది.

బాహుబలి ధీటుగా బిజినెస్
విడుదలకు ముందు ఈ రేంజ్‌లో బిజినెస్ జరిగిన తొలి తెలుగు చిత్రంగా బాహుబలి ఓ ప్రత్యేకతను సంతరించుకొన్నది. ఆ తర్వాత ఆ రికార్డు పవన్ కల్యాణ్ చిత్రానికి రావడం టాలీవుడ్‌లో సంచలనం రేపుతున్నది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. టైటిల్, ఇతర నటీనటుల వివరాలను చిత్ర బృందం త్వరలోనే వెల్లడించనున్నది. ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్లో నిరంతరంగా సాగుతున్నది.

పవన్‌కు ప్రత్యేకంగా
ఈ చిత్రం పవన్ కల్యాణ్ కెరీర్ 25వది. జనసేన పార్టీలో పూర్తి స్థాయి రాజకీయాల్లో ప్రవేశించిన నేపథ్యంలో ఈ సినిమాను బ్లాక్‌బస్టర్‌గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నది. ఈ సినిమా సాధించే విజయం ద్వారా జనసేన పార్టీకి మరింత క్రేజ్ ఏర్పడనున్న నేపథ్యంలో ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్థాత్మకంగా రూపొందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











