»   » అనుష్క కోసం ప్రభాస్.. ఆ హీరోయిన్‌కు చెక్.. అసలేం జరిగిందంటే..

అనుష్క కోసం ప్రభాస్.. ఆ హీరోయిన్‌కు చెక్.. అసలేం జరిగిందంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి2 ఘన విజయం తర్వాత ప్రభాస్ నటించే తదుపరి చిత్రం సాహోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరోయిన్ బాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకోవాలనే ప్లాన్‌తో నిర్మాతలు పలువరు హీరోయిన్ల పేర్లను పరిశీలించారు. వారిలో కత్రినాకైఫ్, శ్రద్ధకపూర్, దిశాపటానీలు ఉన్నారు. ఈ ముగ్గురిని వివిధ కారణాల వల్ల ఎంపిక చేయలేదనిది తాజా వార్త కథనం. అయితే దీనికి భిన్నంగా ఓ రూమర్ మీడియాలో వైరల్‌గా మారింది. తనకు అత్యంత సన్నిహితురాలైన టాలీవుడ్ హీరోయిన్ అనుష్క కోసం కత్రినాకు చెక్ పెట్టినట్టు ఆ రూమర్ సారాంశం కావడం సినీ వర్గాలను మరోసారి ఆలోచనల్లో పడేసింది.

మరోసారి కెమిస్ట్రీ..

మరోసారి కెమిస్ట్రీ..

ఈ గాసిప్ నేపథ్యంలో సాహో చిత్రంలో ప్రభాస్ సరసన అనుష్క మరోసారి నటించనున్నదనే వార్తకు మరింత బలం చేకూరింది. బిల్లా, మిర్చి, బాహుబలి తర్వాత మళ్లీ ఈ జంట కెమిస్ట్రీ సంచలనంగా మారే అవకాశం ఉంది.

అనుష్క వైపే మొగ్గు..

అనుష్క వైపే మొగ్గు..

ప్రభాస్, అనుష్కల మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కవుట్ అవుతుండటంతో నిర్మాతలు కూడా జేజమ్మ వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తున్నది. దాదాపు కత్రినాను ఎంపిక చేయాలన్న ప్రతిపాదనను పక్కనపెట్టి అనుష్కను తీసుకోవాలని నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. అనుష్క కోసం ఈ వ్యవహారం వెనుక ప్రభాస్ చకచకా పావులు కదిపినట్టు తెలుస్తున్నది.

కత్రినా కోసం ఆర్నెళ్లుగా..

కత్రినా కోసం ఆర్నెళ్లుగా..

సాహో చిత్రంలో కత్రినా కైఫ్‌ను తీసుకోవాలని ఆమెను గత ఆర్నెళ్లుగా నిర్మాతలు సంప్రదిస్తున్నారట. సాహో ప్రాజెక్ట్‌లో కత్రినా కైఫ్ ఉండాల్సింది. అయితే ఆమెను తీసుకోవడం లేదు. దాదాపు కత్రినా డేట్స్ కోసం ఆరునెలలు ప్రయత్నించాం అని చిత్ర యూనిట్‌కు సంబంధించిన ఒకరు వెల్లడించారు.

ప్రభాస్‌పై కత్రినాకు..

ప్రభాస్‌పై కత్రినాకు..

బాహుబలికి ముందు ప్రభాస్‌తో కలిసి నటించడానికి కత్రినాకు ఇష్టం లేదట. కానీ బాహుబలి తర్వాత ప్రభాస్‌తో చేయడానికి డేట్స్ కూడా అడ్జస్ట్ చేసిందని, అయితే అనూహ్యంగా నిర్ణయం మారేసరికి చేసేదేమీ లేక ఊరుకొందని సాహు ప్రొడక్షన్‌కు సంబంధించిన వ్యక్తి చెప్పారు.

బాహుబలి హిట్ తర్వాత.

బాహుబలి హిట్ తర్వాత.

ఇదిలా ఉండగా మరో వార్త కూడా ఇటీవల వెలుగులోకి వచ్చింది. గత ఆర్నేళ్లుగా ఎలాంటి నిర్ణయం చెప్పకుండా ఆలస్యం చేసింది. బాహుబలి అనూహ్య విజయం సాధించడంతో కత్రినా సహాయకుల బృందం మాతో సంప్రదింపులు జరుపడానికి ప్రయత్నించారు అని చిత్ర యూనిట్ సభ్యుడొకరు వెల్లడించినట్టు తెలిసింది.

శ్రద్ధాకపూర్‌ను కూడా..

శ్రద్ధాకపూర్‌ను కూడా..

కత్రినా నిర్ణయం చెప్పకపోవడంతో శ్రద్ధాకపూర్‌ను తీసుకోవాలని అనుకొన్నాం. సాహో కథ విన్నప్పుడు ఆమె ఉత్సాహంతో ఎగిరి గంతేసినంత పనిచేసింది. కానీ 8 కోట్లు డిమాండ్ చేయడంతో శ్రద్ధాను తీసుకో వద్దని డిసైడ్ అయ్యాం అని చెప్పారు.

English summary
Post the grand success of Baahubali 2, actor Prabhas' upcoming Telugu film, Saaho is in the tremendous buzz. latest update about the film? Well, rumours are rife that Prabhas has ousted Katrina Kaif from the film and is planning to rope in his alleged girlfriend, Anushka Shetty.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu