Pushpa 2: పుష్ప 2లో బాహుబలి రేంజ్ ట్విస్ట్​ లీక్... బన్నీ కోసం సుక్కు భారీ స్కెచ్​!

ఇండియన్ సినిమా హిస్టరీలో రాజమౌళి ప్రభాస్ కలయిక బహుబలి ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే. బాక్సాఫీస్​ను షేక్ చేసి వందల కోట్లను ఖాతాలో వేసుకుంది. అయితే ఈ తొలి భాగంలో సినిమా మొత్తం ఓ రేంజ్​ అయితే క్లైమాక్స్ మరో ఎత్తు. అదే సినిమాకు పెద్ద ట్విస్ట్​. దాంతోనే సీక్వెల్​పై భారీ అంచనాలు రేపి రెండో భాగంతోనూ హిట్ అందుకున్నారు. అయితే ఇప్పుడీ రేంజ్​లో భారీ ట్విస్ట్​ను దర్శకుడు సుకుమార్ తన పుష్ప 2 సినిమా కోసం వాడుకోబోతున్నట్లు లీక్​ అయింది. దాని గురించే ఈ కథనం...

బాక్సాఫీస్‌ను శాసించడానికి పుష్ప రాజ్‌ ఈ ఏడాది ఆగస్టు 15న రాబోతున్న సంగతి తెలిసిందే. సూపర్ హిట్​ పుష్ప: ది రైజ్‌కి కొనసాగింపుగా రెండో భాగం పుష్ప 2 రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. మొదటి భాగం నేషనల్ వైడ్​లో ఆడియెన్స్​ను విశేషంగా అలరించింది. మూవీలోని బన్నీ మేనరిజమ్‌, డైలాగ్స్​ ఇంటర్నేషనల్​ రేంజ్​లో పాపులర్​ అయ్యాయి. ఇందులోని నటనకిగానూ హీరో ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం కూడా దక్కింది. అందుకే సీక్వెల్​పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Baahubali range twist Leaked From Allu Arjun Rashmika Sukumar Pushpa 2 Movie News Goes Viral

సౌత్ ఆడియన్స్​తో పాటు నార్త్ ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి మరోసారి ఇంకో విషయం లీక్ అయింది. అదేంటంటే.. సినిమాలో పుష్పకు నమ్మిన బంటువుగా ఉంటాడు​ కేశవ. అతడి పాత్రకు కూడా మంచి క్రేజ్ దక్కింది. దీంతో రెండో భాగంలోనూ అతడి పాత్ర ఎంతో కీలకంగా ఉండేలా డిజైన్ చేశారని తెలిసింది.

కానీ ఈ మధ్య అతడు రియల్ లైఫ్​ ఓ అనుమానస్పద యువతి ఆత్మహత్య కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో షూటింగ్​కు కూడా కాస్త బ్రేక్ పడింది. దీంతో మూవీటీమ్​ అతడి కోసం రూ.70లక్షల రూపాయలు(బయట సమాచారం) ఖర్చు చేసి మరీ బెయిల్​పై బయటకు తీసుకొచ్చింది! అంటే అతడి పాత్ర ఎంత కీలకంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడు అతడి పాత్ర గురించే ఓ వార్త లీక్ అయింది. అతడే పుష్పను చంపబోతున్నట్టు తెలిసింది. సినిమా చివర్లో పుష్ప రాజ్​ చనిపోతాడు అని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. చిత్రంలో పుష్పను ఎదురించే వారు ఉన్నా అతడిని చంపే సత్తా ఎవరికి ఉండదు. కాబట్టి పుష్పను చంపే వాడెవడు? అనే పాయింట్​తో కథ తిరుగుతుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సినిమా చివర్లో ప్రలోభాలకు లోబడిన పుష్ప ఫ్రెండ్ కేశవే పుష్పను చంపేస్తాడు అని లీకైంది. మరి ఇందులో నిజమెంతో తెలీదు కానీ ప్రస్తుతానికి ఈ వార్త నెట్టింట్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో బాహుబలి రేంజ్​లో క్లైమాక్స్​ రెడీ చేస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే సినిమాలో రష్మిక కథానాయికగా నటిస్తోంది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్​పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. దాదాపు రూ.500కోట్ల బడ్జెట్​ అని తెలుస్తోంది. ఫహాద్‌ ఫాజిల్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, ధనుంజయ్‌ తదితరులు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం, మిరోస్లా క్యూబా బ్రోజెక్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ప్రొడక్షన్‌ డిజైన్‌ : ఎస్‌.రామకృష్ణ, మోనిక. చంద్రబోస్‌ పాటల బాధ్యతను చూసుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X