»   » సల్మాన్ ఖాన్ ఎఫెక్ట్: ‘బాహుబలి’ కూడా వాయిదా?

సల్మాన్ ఖాన్ ఎఫెక్ట్: ‘బాహుబలి’ కూడా వాయిదా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి' మూవీ కోసం తెలుగు సినిమా ప్రేక్షకులు మాత్రమే కాదు యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రం వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. పలు కారణాలతో రిలీజ్ ఆలస్యం అయింది.

ఎట్టకేలకు ఈ చిత్రాన్ని జులై 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ ఈ చిత్రం మరోసారి వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. అందుకు కారణం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అని టాక్ . సల్మాన్ ఖాన్ నటించిన ‘బజ్రంగి భాయ్‌జాన్' చిత్రం జులై 17న విడుదలవుతుండటమే ఇందుకు కారణం అని అంటున్నారు.


సల్మాన్ ఖాన్ సినిమా విడుదల నేపథ్యంలో ‘బాహుబలి' సినిమాకు థియేటర్లు దొరకడం కష్టం, అందుకే సినిమాను జులై 30కి వాయిదా వేయాలని ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేస్తున్న కరణ్ జోహార్ పట్టుబడుతున్నట్లు టాక్. ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.


Baahubali Release To Be Postponed to July 30?

అయితే సినిమా వాయిదా వేస్తే తెలుగుతో పాటు, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇప్పటికే ఖరారైన షెడ్యూల్ అస్తవ్యస్తం అవుతుందని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనా ఇది చిక్కుముడి లాంటి సమస్యే అని చెప్పక తప్పదు. మరి ఏం జరుగుతుందో చూద్దాం.


రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, ప్రభాకర్ ముఖ్య పాత్రలు పోషించారు. 250 కోట్ల బడ్జెట్ తో రెండు భాగాలుగా ఆర్కా మీడియా బేనర్లో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. హిందీలో ఈచిత్రాన్ని కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ విడుదల చేస్తోంది. తెలుగు, తమిళం, హిందీ, మళయాలంతో పాటు పలు విదేశీ భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
It is known that S S Rajamouli's magnus opus, Baahubali's first part is slated to release on 10 July. All the other biggies have also fine tuned its release dates based on Baahubali's release. But to the shock of everyone, Baahubali's release date might get postponed to July 30.
Please Wait while comments are loading...