twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విడుదల ముందే కోట్లలో బిజినెస్....‘బాహుబలి’ రికార్డ్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బాహుబలి' చిత్రం విడుదల ముందు రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రం సీడెడ్, బెంగుళూరు రైట్స్ తెలుగు సినిమా చరిత్రలో ఏ సినిమాకు అమ్ముడు పోని విధంగా కోట్లాది రూపాయాలకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.

    ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ బాహుబలి సీడెడ్ రైట్స్ రూ. 13 కోట్లకు, బెంగుళూరు రైట్స్ రూ. 9 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. రాజమౌళికి ఉన్న అపజయం ఎరుగని హిట్ ట్రాక్ రికార్డ్ ఓ వైపు....బాహుబలి భారీ చిత్రం కావడం మరో వైపు ఈచిత్రానికి ఇంత క్రేజ్ రావడానికి కారణమని తెలుస్తోంది.

    బాహుబలి సినిమాను రెండు పార్టులుగా చిత్రీకరిస్తున్న రాజమౌళి.....రెండు భాగాలకు కలిపి రూ. 175 కోట్ల వరకు ఖర్చు పెట్టిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే ఇండియన్ సినిమా చిరిత్రలో ఇదే అత్యంత భారీ బడ్జెట్ మూవీ.

    Baahubali’s Bangalore and Ceded rights sold for 22 cr

    ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీలో పాటు విదేశీ బాషల్లో కూడా విడుదల చేస్తారట. రెండు పార్ట్స్ కాబట్టి పెట్టిన పెట్టబడి గ్యారంటీగా తిరిగి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకైతే రాజమౌళి అంచనాలు తప్పలేదు. ఏది చేసినా ముందు దాని గురించి క్షుణ్ణంగా స్టడీచేసి పర్‌ఫెక్టుగా చేయడం ఆయన స్టైల్. మరి రాజమౌళి ప్రయత్నం సక్సెస్ అయి తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలు దాటాలని ఆశిద్దాం.

    ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క శెట్టి, తమన్నా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇంకా రమ్యకృష్ణ, సత్యరాజ్, నాసర్, అడవి శేష్, సందీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బాహుబలి మొదటి పార్ట్ 2015లో థియేటర్లోకి వస్తుందని అంటున్నారు.

    English summary
    
 Rajamouli’s 'Baahubali' distribution rights of both Bangalore and ceded have been bought for a whopping 9 and 13 crores respectively for the first part. A highly renowned production house is behind bagging these rights.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X