»   »  ‘బాహుబలి’ విడుదల వాయిదా వేస్తున్నారా?

‘బాహుబలి’ విడుదల వాయిదా వేస్తున్నారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘బాహుబలి'. ఈ చిత్రాన్ని మే 15 విడుదల చేస్తున్నట్లు రాజమౌళి ఆ మధ్య ప్రకటించారు. అయితే పరిస్థితి చూస్తుంటే సినిమా అనుకున్న సమయానికి విడుదల కావడం కష్టమే అంటున్నారు.

సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాక పోవడంతో సినిమా విడుదల జూన్ నెలాఖరుకు వాయిదా పడే అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమాకు ప్రధానమైనవి విజువల్ ఎఫెక్ట్స్ కాబట్టి దర్శకుడు రాజమౌళి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే బాహుబలి టీం నుండి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.


Baahubali’s release postponed to June end?

ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తైంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం యూనిట్ సంప్రదాయబద్దంగా గుమ్మిడికాయ కొట్టే తంతుని నిర్వహించారు. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. తెలుగులో సినిమా చరిత్రలోనే ఇదొక అద్భుతమైన చిత్రంగా చెబుతున్నారు.


ప్రస్తుతం మొదటి భాగానికి సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. బాహుబలి, శివుడు.. ఇలా ప్రభాస్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. బాహుబలి సరసన అనుష్క నటిస్తుంటే, శివుడుకి జోడీగా తమన్నా కనిపించబోతోంది. సత్యరాజ్‌, రమ్యకృష్ణతో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రానికి కథ: కె.వి.విజయేంద్రప్రసాద్‌, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: సెంథిల్‌ కుమార్‌.

English summary
Earlier reports said that Baahubali will release on the 15th of May. But latest update reveals that the film’s release is likely to be pushed ahead to June end because the VFX works need special focus and are taking extra time. An official confirmation is yet to be received from the makers.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu