షాకింగ్.. దీపికా పదుకొనె సరసన ప్రభాస్.. ఒక్క మాటతో, సంచలన నిర్ణయం!
Recommended Video

బాహుబలి తరువాత ప్రభాస్ జాతీయ స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. బాహుబలిలో ప్రభాస్ నటన, పోరాటాలకు బాలీవుడ్ అభిమానులు సైతం ఫిదా అయ్యారు. బాహుబలి తరువాత ప్రభాస్ తో సినిమా చేయాలనే ఆలోచన బాలీవుడ్ దర్శక నిర్మాతలకు తప్పకుండా వచ్చి ఉంటుంది. ఆ కోణంలోనే తాజాగా సంచలన వార్త బయటకు వచ్చింది.

క్రేజీ ఆఫర్
ప్రఖ్యాత దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన పద్మావత్ చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలో అవకాశం వస్తే ఏ నటుడు కూడా వదులుకోవడానికి ఇష్టపడడు. కానీ ఈ చిత్రాన్ని ప్రభాస్ రిజెక్ట్ చేసాడని తాజాగా బాలీవుడ్ మీడియాలో న్యూస్ వైరల్ అయింది.

దీపికా సరసన
సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వం, దీపికా పదుకొనె హీరోయిన్ అంటే అది తప్ప కూడా క్రేజీ చిత్రమే. అది కూడా పద్మవత్ చిత్రానికి మొదట ఐశ్వర్య రాయ్ అని అనుకున్నారు. ఇలాంటి చిత్రంలో రాజా రావల్ సింగ్ పాత్ర పోషించాలని భన్సాలీ ప్రభాస్ ని అడిగారట.

సంచలన నిర్ణయం
బాలీవుడ్ లో ప్రభాస్ కు ఇది క్రేజీ ఆఫరే. కానీ ఒక్క మాటతో ప్రభాస్ ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశాడట. బాహుబలి తరువాత తాను అలాంటి చిత్రాలకు మానసికంగా సిద్ధంగా లేనని అందువలన ఈ చిత్రం చేయలేనని తెలిపాడు. ఈ మేరకు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

షాహిద్ కపూర్
ప్రభాస్ రిజెక్ట్ చేయడంతో ఆ పాత్ర కోసం షాహిద్ కపూర్ ని భన్సాలీ ఎంపిక చేసుకున్నాడు. బాహుబలి చిత్రంతో చరిత్ర సృష్టించిన ప్రభాస్ వెంటనే అలంటి చిత్రంలో నటించడానికి ఇష్టపడలేదని అందువలనే రిజెక్ట్ చేశాడనే ప్రచారం జరుగుతోంది.

అందుకే సాహో
బాహుబలి లాంటి జానపద తరహా కథలో నటించిన ప్రభాస్ ప్రస్తుతం అల్ట్రా మోడ్రన్ టెక్నాలజీతో రూపొందుతున్న సాహో చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











