»   » ‘బాహుబలి - ది కంక్లూజన్’ (పార్ట్ 2) : విడుదల తేదీ, బ్యాలెన్స్ డిటేల్స్

‘బాహుబలి - ది కంక్లూజన్’ (పార్ట్ 2) : విడుదల తేదీ, బ్యాలెన్స్ డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మొన్న శుక్రవారం భారీ అంచనాల మధ్య విడుదలైన 'బాహుబలి' చిత్రం రికార్డు స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్స్ రాబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేఫధ్యంలో ఈ చిత్రం సెకండ్ పార్ట్ గురించి అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. ఈ నేఫధ్యంలో ఈ సెకండ్ పార్ట్ గురించి కొన్ని విషయాలు బయిటకు వచ్చాయి. అందులో మొదటిది ఈ చిత్రం విడుదల తేదీ. జనవరి 8, 2016 న సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఇక ఈ సెకండ్ పార్ట్ షూటింగ్ విషయానికి వస్తే...దాదాపు అందరి లీడింగ్ ఆర్టిస్టుల కాల్ షీట్స్ పూర్తి అయిపోయాయని తెలుస్తోంది. ఇంకా VFX వర్క్, ఇరవై రోజుల బ్యాలెన్స్ మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది.


Baahubali - The Conclusion release date

'బాహుబలి' రెండో భాగం ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తికరమైన అంశం. ఈ చిత్రానికి ''బాహుబలి - ది కంక్లూజన్‌' అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో మొదటి భాగంలో ఉన్న సందేహాలు అన్నీ కంక్లూజన్ దొరుకుతుందనే ఈ టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం గురించి సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.


'బాహుబలి 2' గురించి రానా మాట్లాడుతూ... ''బాహుబలి - ది కంక్లూజన్‌' వచ్చాక 'బాహుబలి - ది బిగినింగ్‌' చాలా చిన్నదిగా కనిపిస్తుంది. రెండో భాగంలో పోరాట సన్నివేశాలు, భావోద్వేగాలు, సెట్లు... ఇలా అన్నీ ఇంకా భారీగా ఉంటాయి''అన్నాడు రానా.


దానికి తోడు... బాహుబలి మేకర్స్ ..రెండు రోజుల క్రితం ...కొన్ని ఎడిషనల్ సీన్స్ కలిపి...ప్రేక్షకుల కన్ఫూజన్ తొలిగించాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా అర్దాంతరంగా ముగిసిన ముగింపుని జస్టిఫై చేయాలనుకున్నారు.


Baahubali - The Conclusion release date

అందునిమిత్రం..అఫీషియల్ గా పీఆర్ వాళ్లు ట్వీట్ సైతం చేసారు. "Teaser Shots from Part 2 have been added post credits in #Baahubali... They have been added to all QUBE prints," . అయితే ...సెన్సార్ బోర్డ్ ఆపీసర్ మాత్రం... మా దగ్గరకి ...కొత్త సీన్లు యాడ్ చేయటానికి రాలేదు అని అన్నారు.


టైటిల్ తో పాటు అన్ని విషయాల్లోనూ అత్యంత భారీతనం కనిపించిన బాహుబలి చిత్రం కలెక్షన్లను కూడా భారీగానే కొల్లగొట్టి సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది.


మరో ప్రక్క సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు అయిన ఫేస్ బుక్, ట్విటర్ లో 'బాహుబలి' హవా కొనసాగుతోంది. కెరీర్ లో ఇప్పటివరకు తీసిన తొమ్మిది చిత్రాలలో ఏ ఒక్కటీ ఫ్లాప్ కాలేదు. దాంతో ఈ పదో సినిమా కూడా పాజిటివ్ టాక్ తో రన్ అవటం అందరికీ ఆనందాన్ని కలిగిస్తోంది.

English summary
Baahubali - The Conclusion Will Release on Jan 8th 2016 .All Leading actors call sheets are over - VFX work & 20 Days patch work Balance
Please Wait while comments are loading...