Baahubali The Epic: బాహుబలి రీరిలీజ్.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా? రాజమౌళి ఏం చేస్తున్నారంటే?
టాలీవుడ్లో రీరిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, మెగాస్టార్, బాలయ్య, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ ఉత్తమ చిత్రాలు రీరిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇండియాస్ బిగెస్ట్ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా పెంచిన చిత్రం బాహుబలి రీరిలీజ్ కాబోతోంది. ఈ చిత్రం మొదటి భాగం బాహుబలి : ది బిగినింగ్ విడుదలై జూలై 10, 2025 నాటికి 10 ఏళ్లు పూర్తైంది. దీంతో 10వ వార్షికోత్సవాన్ని రీసెంట్ గా హైదరాబాద్ లో టీమ్ ఘనంగా జరిపింది. ఇక బాహుబలి : ది ఎపిక్ (Baahubali : The Epic) టైటిల్ తో రీలోడెడ్ వెర్షన్ ను రెడీ చేస్తున్నారు. బాహుబలి రీరిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు. ఈ సందర్భంగా బాహుబలి : ది ఎపిక్ చిత్రానికి కొన్ని విషయాలు ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..
బాహుబలి సెట్ చేసిన రికార్డులు..
ఆర్కా మీడియా బ్యానర్ లో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవీనేని నిర్మాతలుగా 2015లో రూపుదిద్దుకున్న ఫస్ట్ భారీ బడ్జెట్ చిత్రం బాహుబలి : ది బిగినింగ్. ఈ చిత్రంతోనే టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ ప్రారంభమైంది. వరల్డ్ మార్కెట్ లో తెలుగు సినిమాల పేర్లు వినబడటం ప్రారంభమైంది. ముఖ్యంగా బాహుబలి : ది బిగినింగ్ తో తెలుగు ప్రేక్షకులకు భారీ విజువల్స్ ను అందించారు రాజమౌళి, అలాగే సీక్వెల్స్ ట్రెండ్ ను సెట్ చేశారు. ఆ తర్వాత 2017లో బాహుబలి : ది కన్ క్లూజన్ చిత్రంతో వరల్డ్ సినిమా మ్యాప్ లో టాలీవుడ్ జెండాను పాతారు. వరల్డ్ వైడ్ గా ప్రధాన భాషల్లో విడుదల చేసి విదేశీ ప్రేక్షకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. మరోవైపు బాక్సాఫీస్ వద్ద కూడా టాలీవుడ్ సత్తాను చూపించారు. బాహుబలి చిత్రంతో నేషనల్ అవార్డుతో సహా అన్నీ అవార్డులను దక్కించుకున్నారు. ఇక బాహుబలి 2తో ఇంటర్నేషనల్ అవార్డ్స్ ను సొంతం చేసుకున్నారు.

బాహుబలి : ది ఎపిక్ గా రీరిలీజ్..
ప్రస్తుతం రీరిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతుండటంతో 10 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి రీరిలీజ్ కు ఏర్పాటు చేస్తున్నారు. బాహుబలి 1, బాహుబలి 2 రెండు పార్టులను కలిపి బాహుబలి : ది ఎపిక్ గా రిలీజ్ చేయబోతున్నారు. అక్టోబర్ 31, 2025న రీరిలీజ్ చేయబోతున్నామని ప్రకటించడం విశేషం. దీంతో బాహుబలి లవర్స్, సినీ ప్రేక్షకులు ఫుల్ ఖుషి అవుతున్నారు. మరోసారి మహిశ్వమతి, కుంతల రాజ్యాల్లో ప్రభాస్ , రానా, అనుష్క శెట్టి, తమన్న, రమ్య కృష్ణ, సత్యరాజ్ పాత్రలను వీక్షించేందుకు సిద్ధమవుతున్నారు.
రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ..
బాహుబలి : ది ఎపిక్ రీలోడెడ్ వెర్షన్ రిలీజ్ కావడానికి ఇంకా రెండు 4 నెలల సమయం ఉంది. అందుకు కారణం ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి : ది బిగిన్, బాహుబలి : ది కన్ క్ల్యూజన్ చిత్రాలను ఒకే ప్రింట్ లో ఇవ్వబోతున్నారు. దీంతో 4 గంటలపాటు సినిమా నిడివి వస్తోందని తెలుస్తోంది. మరోవైపు బాహుబలి : ది ఎపిక్ లో డిలీటెడ్ సీన్లను కూడా యాడ్ చేయబోతున్నారంట. ఫైనల్ కట్ 3.50 నిమిషాలకు తీసుకురావాలని అనుకుంటున్నారు. దీంతో రాజమౌళితోనే దగ్గరుండి ఎడిట్ చేయబోతున్నారంట. అటు SSMB 29 షూటింగ్ ను కొనసాగిస్తూనే ఈ ప్రాజెక్ట్ కు సమయం కేటాయిస్తున్నారని తెలుస్తోంది.
బాహుబలి టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్..
బాక్సాఫీస్ వద్ద బాహుబలి చిత్రం రికార్డ్ క్రియేట్ చేసింది. బాహుబలి : ది బిగినింగ్ రూ.180 కోట్లతో రూపుదిద్దుకొని బాక్సాఫీస్ వద్ద రూ.650 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఇక బాహుబలి 2 : ది కన్ క్ల్యూజన్ చిత్రం రూ.250 కోట్లతో నిర్మితమైంది. బాక్సాఫీస్ వద్ద రూ.1810 కోట్ల గ్రాస్ వసూల్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్ గా హ్యయేస్ట్ గ్రాస్ వసూల్ చేసిన 2వ ఇండియన్ ఫిల్మ్ గా రికార్డ్ సెట్ చేసింది. బాహుబలి మిగితా వసూళ్లను కలుపుకొని మొత్తం రూ.2500 కోట్లకు పైగానే వసూల్ చేయడం విశేషం.


Click it and Unblock the Notifications











