»   » 'బాహుబలి' రాజమౌళి నిర్ణయం మార్చుకున్నారా?

'బాహుబలి' రాజమౌళి నిర్ణయం మార్చుకున్నారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'బాహుబలి'. అనుష్క, తమన్నా హీరోయిన్స్. రానా కీలక పాత్రధారి. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మే 15 న విడుదల చేయాలని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు..విజువల్ గ్రాఫిక్స్ మరింత లేటు అవటంతో... ఈ చిత్రాన్ని జూన్ కి విడుదల చేసే ఆలోచనలో దర్శక,నిర్మాతలు ఉన్నట్లు సమాచారం.

ఇక ఈ చిత్రం దర్శక,నిర్మాతలు... పూర్తిగా ప్రమోషన్ పై దృష్టి పెట్టడానికి సిద్దపడుతున్నారు. మే 10 న ఈ చిత్రం థియోటర్ ట్రైలర్ విడుదల కానుందని సమాచారం. అలాగే ఈ చిత్రం కోసం ప్రత్యేకమైన డాక్యుమెంట్ ని సైతం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


చిత్రానికి సంభందించిన ప్రమోషన్ ...ఏప్రియల్ 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రియల్ 25 న చిత్రానికి సంభిందించిన షార్ట్ టీజర్ వస్తుందని తెలుస్తోంది. అలాగే...చిత్రానికి సంభిందించిన వాల్ పోస్టర్స్ డిజైన్స్ ఫైనల్ చేస్తున్నారని,సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో వాటిని విడుదల చేస్తారని వినికిడి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఊపందుకుంది. త్వరలోనే ఇక టీజర్స్ వచ్చి మనని అలరిస్తాయి.


Baahubali will now be releasing in June!

తన వూహల రాజ్యం మహిష్మతి నేపథ్యంలో ఓ డాక్యుమెంట్‌ని రూపొందించబోతున్నారు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ఆ రాజ్యంలో ప్రజల జీవన స్థితిగతులు, ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు, రాజకీయాలు, వైద్యం, కుటుంబ అనుబంధాలు... ఎలా ఉండేవో చెబుతూ ఆ డ్యాక్యుమెంట్‌ని రూపొందిస్తారు. 'బాహుబలి' వెయ్యేళ్ల క్రితం నాటి కథ కావడంతో... నాటి వాతావరణాన్ని వూహిస్తూ అందరికీ ఆదర్శవంతంగా ఉండేలా డాక్యుమెంట్‌ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోంది చిత్రబృందం.


రెండు భాగాలుగా తెరకెక్కుతున్న 'బాహుబలి'లో ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తొలి భాగం చిత్రాన్ని వచ్చే నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఇటీవల సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.


గత రెండు సంవత్సరాలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, రాణా, అనుష్క, తమన్న , నాజర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మళయాళీ, హిందీ భాషల్లోనూ ఒకేసారి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

English summary
"Baahubali" which was slated to release on May 15 is now being pushed to June, according to the rumors.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu