Venkatesh-Anil Ravipudi: ఇద్దరు హీరోయిన్లతో వెంకటేష్ రొమాన్స్.. అనిల్ రావిపూడి సినిమా టైటిల్ ఇదేనా?

టాలీవుడ్‌లో మరోసారి భారీ క్రేజీ కాంబినేషన్ తెరపైకి రాబోతోంది. చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా అనిల్ రావిపూడి రూపొందించిన 'మన శంకరవరప్రసాద్‌గారు' (Mana Shankara Vara Prasad Garu) బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సక్సెస్ నేపథ్యంలో హిట్ మిషన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ తో కలిసి ఓ క్రేజీ మూవీని తెరకెక్కించబోతున్నారు. గతంలో ఈ కాంబోలో వచ్చిన F2, F3, సంక్రాంతికొస్తున్నాం సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. దీంతో మరోసారి వీరి కలయికపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్‌పై అనేక రకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా ఇద్దరు హీరోయిన్లతో వెంకటేష్ రొమాన్స్, అనిల్ రావిపూడి కొత్త సినిమా టైటిల్ ఇదేనా? అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా వాటికి ముగింపు పలికేలా, ఈ సినిమాకు సంబంధించిన అనధికారిక టైటిల్ టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.ఈ సినిమాకు "బామ్మార్ధి బాలిరెడ్డి" (Baammardhi Baalireddy) అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు టాక్.

Baammardhi Baalireddy Title Buzz Venkatesh-Anil Ravipudi s Dual-Heroine Film Set for Sankranthi 2027

అలాగే.. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ సరసన ఇద్దరు స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారనే విషయం ఇప్పుడు మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒకవైపు నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ (Keerthy Suresh), మరోవైపు టాలీవుడ్ టాప్ హీరోయిన్ (Pooja Hegde) ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఇద్దరు భామలతో వెంకీ మామా చేసే రొమాన్స్, అనిల్ రావిపూడి మార్క్ కామెడీతో కలిసితే థియేటర్లలో నవ్వుల జాతర ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇంకో పెద్ద హైలైట్ ఏంటంటే... ఈ సినిమాలో మలయాళ ఇండస్ట్రీ వర్సటైల్ స్టార్ ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) కీలక పాత్రలో నటించనుండటం. వెంకటేష్ - ఫహద్ ఫాసిల్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని టాక్. ఫహద్ సరసన హీరోయిన్‌గా ఆషిక రంగానాథ్ (Ashika Ranganath) కనిపించనున్నారు. ఈ నాలుగు ప్రధాన పాత్రల మధ్య నడిచే డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాకు మరో లెవల్ ఎనర్జీ ఇస్తుందని భావిస్తున్నారు.

సాంకేతికంగా కూడా ఈ సినిమా బలంగా ఉండబోతోంది. సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo)అందిస్తున్నారు. ఆయన ఇటీవల సినిమాల్లో ఇచ్చిన మాస్ బీట్స్, ఫోక్ టచ్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ అవుతాయని మేకర్స్ భావిస్తున్నారు. నిర్మాణ బాధ్యతలను షైన్ స్క్రీన్స్ అండ్ సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా చేపడుతున్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తయ్యాయని, షూటింగ్‌ను జూలై 2026 నుంచి ప్రారంభించాలనే ప్లాన్‌లో టీమ్ ఉన్నట్లు సమాచారం. అనిల్ రావిపూడి అంటేనే సంక్రాంతి సెంటిమెంట్. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X