వీళ్లంతా 'RX 100', 'బేబీ'లు కాదు.. గోల్డెన్ హార్ట్ బ్యూటీస్.. చూస్తే ప్రేమలో పడిపోతారంతే!
సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన కొత్త చిత్రం 'బేబీ'. ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంటూ దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా హీరోతో పాటు హీరోయిన్ వైష్ణవి చైతన్యకు ఎంత క్రేజ్ తీసుకొచ్చిందో.. అదే రేంజ్ లో వైష్ణవికి కొన్ని చిక్కులను తీసుకొచ్చింది. సినిమాలో ఆమె పాత్ర చేసిన మిస్టేక్ కు రియల్ లైఫ్ లో ఆమెను ట్రోల్స్ చేస్తూ.. అలాగే మిగతా ఆడవారిని తప్పుగా భావిస్తున్నారు కొంతమంది నెటిజన్లు(అబ్బాయిలు). అయితే అదే సమయంలో వారికి దీటుగా గోల్డెన్ హార్ట్ బ్యూటీలు కూడా ఉంటారని మరికొంతమంది.. అద్భుతంగా చూపించిన హీరోయిన్ క్యారెక్టరైజేషన్ పాత్రలను ట్రెండ్ చేస్తున్నారు. వివరాళ్లోకి వెళ్లితే...
బేబీ.. సినీ ఇండస్ట్రీలో, మూవీ లవర్స్ లో, సోషల్ మీడియా అంతా ఈ మూవీ గురించే చర్చ. ఎందుకంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రంలో ఈ జనరేషన్ యూత్ ప్రేమలు ఎలా ఉన్నాయి, వారి ఆలోచన విధానం ఎలా ఉంది, అమ్మాయిలు.. అబ్బాయిలను ఎలా మోసం చేస్తున్నారు వంటి విషయాలను చూపించారు. దీంతో ఈ చిత్ం యూత్ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయిపోయింది. ముఖ్యంగా టీనేజీ కాలేజీ కుర్రాళ్లైతే ఎగబడి మరీ చూస్తున్నారు.

బాక్సాఫీస్ వద్ద వసూళ్లే వసూళ్లు... :యూత్ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయిపోవడం వల్ల.. సినిమా చూసేందుకు యువతి యువకులు.. థియేటర్లకు భారీగా తరలివస్తున్నారు. దీంతో థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి. అలా ఈ చిత్రం కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఇంకా వసూళ్లను భారీగా అందుకుంటోంది. వస్తున్నాయి. వారం రోజుల్లో దాదాపు రూ.50 కోట్లు అందుకుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం సినిమాలు కూడా ఏమీ లేవు.. పైగా వీకెండ్ కాబట్టి.. ఈ చిత్రం మరిన్ని వసూళ్లను అందుకునే అవకాశం ఉంది.

వైష్ణవిపై ట్రోల్స్.. :ఈ సినిమాలో వైష్ణవి చైతన్య చేసిన పాత్రకు, ఆమె యాక్టింగ్ కు మంచి గుర్తింపుతో పాటు సూపర్ క్రేజ్ వచ్చింది. విమర్శకుల ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. థియేటర్స్‌లో ఆమె పాత్రకు విజిల్స్ వేస్తున్నారు కుర్రాళ్లంతా. అరిచి మరీ గోల చేస్తున్నారు. అయితే మరోవైపు.. మూవీలో కాస్త బ్యాడ్ టచ్ ఉన్న వైష్ణవి చైతన్య పాత్ర చేసిన తప్పునకు.. నెటిజన్లు(అబ్బాయిలు).. నిజజీవితంలోని అమ్మాయిలను ఉద్దేశిస్తూ తప్పుగా చిత్రీకరిస్తున్నారు. అమ్మాయిలు అంతే మోసం చేస్తారంటూ తప్పుబడుతున్నారు. గతంలో 'ఆర్ఎక్స్ 100'లో పాయల్ రాజ్‌పుత్ చేసిన పాత్రను కూడా హైలైట్ చేస్తున్నారు. అలా 'RX 100', 'బేబీ' సినిమాల హీరోయిన్లకు సంబంధించిన సన్నివేశాలను నెట్టింట్లో తెగ ట్రోల్స్ చేస్తున్నారు.
గోల్డెన్ హార్ట్ బ్యూటీస్.. :అయితే ఈ ట్రోల్ వీడియోస్ కు దీటుగా ఇంకొంతమంది.. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ మంచిగా ఉన్న రోల్స్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు తెలుగులో మనసుకు హత్తుకునే ఎన్నో ప్రేమ కథా సినిమాలు వచ్చాయి. ఆ చిత్రాల్లో కథానాయకుల కోసం హీరోయిన్లు చేసే సాహసం, వారి ఆలోచన విధానం, మాట్లాడే మాటలు, లుక్స్.. అని ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి. ఇప్పుడా పాత్రలన్నింటినీ ఓ చోటకు చేర్చి.. వీరంతా ఆర్ఎక్స్ 100, బేబీ బ్యూటీలు కాదంటూ వీడియోగా క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. గోల్డెన్ హార్ట్ బ్యూటీస్ అనే వ్యాఖ్య రాసి తెగ షేర్ చేస్తున్నారు.
ఈ వీడియోలో గోదావరి(రూపా), ఆనంద్ ఓ మంచి కాఫీ లాంటి సినిమాలో కమలిని ముఖర్జీ, నువ్వొస్తానంటే నేనొద్దంటానా(సిరి), మణిరత్నం సఖి (శాంతి), సీతారామం(సీత), అంటే సుందరానికి(లీలా), బొమ్మరిల్లు (హాసిని), ప్రభాస్ మిస్టర్ పరఫెక్ట్ కాజల్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అంజలి(సీత).. ఇంకా పలు చిత్రాల్లోని కథానాయిక పాత్రలను చూపించారు. 'అబ్బాయిలు భయపడకండి. మంచి అమ్మాయిలు కూడా ఉన్నారు అంటూ తెగ కామెంట్లు చెస్తున్నారు. సినిమాలోని పాత్రలు కేవలం కల్పితం అని, సీరియస్‌గా తీసుకోవద్దని చెబుతున్నారు. రియల్ లైఫ్ లో మంచి చెడు రెండు ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. అనవసరంగా ఒకరిని నిందించొద్దని అంటున్నారు.


Click it and Unblock the Notifications











