బేబీ బ్యూటీకి అల్లు అరవింద్ బంపర్ ఆఫర్.. వర్కౌటైతే ఇక అల్లు ఫ్యామిలీ హీరోతో ఫిక్స్!
యూట్యూబ్ స్టార్ వైష్ణవి చైతన్య.. బేబీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక ఈమె క్రేజ్ అంతా ఇంతా కాదు.. సోషల్ మీడియాలో మొత్తం ఈ బ్యూటీ హవానే నడుస్తోంది. ఇక బేబీ సినిమాతో వైష్ణవి మంచి క్రేజ్ తెచ్చుకోగా.. ఆమె నెక్ట్స్ మూవీ అప్టేట్ వచ్చింది. అల్లు బ్యానర్ లో ఈ భామ నటించనుందని తెలుస్తోంది. ఇక ఆ వివరాల్లోకి వెళితే...
బేబీతో మంచి గుర్తింపు... :సాయి రాజేశ్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం బేబి. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ సినిమాకు యూత్ లో మంచి క్రేజ్ అయితే ఏర్పడింది. నేటి కుర్రకారుకు ఈ సినిమా బాగా కనెక్ట్ కావడంతో.. థియేటర్లకు జనం క్యూ కడుతున్నారు. ఇక ఈ సినిమాతోనే యూట్యూబ్ స్టార్ వైష్ణవి హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఈ చిత్రంలో ఆమె పాత్రకు మంచి గుర్తింపు అయితే వచ్చింది.

ఛాలెంజింగ్ రోల్ లో... :ఇప్పటికే ఈ సినిమా 50 కోట్ల మార్కను కూడా దాటేసింది. ఈ సినిమాలో వైష్ణవి పాత్ర ఓ ఛాలెంజింగ్ రోల్ అని చెప్పవచ్చు. మొదటి సినిమా అయినప్పటికీ వైష్ణవి నటన.. బాగుందని సినిమా పెద్దలు కూడా మెచ్చుకుంటున్నారు. మొన్న బేబీ సక్సెస్ మీట్ లో కూడా నిర్మాత అల్లు అరవింద్.. వైష్ణవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పడే పెళ్లి చేసుకోకు.. మంచి ఫ్యూచర్ ఉందని సలహా కూడా ఇచ్చాడు.
లక్కీ హీరోయిన్...:ఇదిలా ఉంటే.. వైష్ణవి చైతన్య నెక్ట్స్ మూవీ అప్డేట్ వచ్చింది. ఆమె అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయనుందని వార్తలు వస్తున్నాయి. ఈ బ్యూటీ తన రెండో సినిమాకు సైన్ కూడా చేసిందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇక రెండో సినిమాకే పెద్ద బ్యానర్ లో చేయడం.. లక్కీ అని నెటిజన్స్ అంటున్నారు.

అల్లు ఫ్యామిలీలోకి...:గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు శిరీష్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుందట. ఈ సినిమాలో బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్యను తీసుకున్నట్లు సమాచారం. వైష్ణవి... శీరిష్ కు తగిన జోడి అవుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అల్లు అరవింద్ స్వయంగా వైష్ణవి పేరును సజెస్ట్ చేశారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన అగ్రిమెంట్లపై వైష్ణవి సైన్ కూడా చేసిందని టాక్. అధికారిక ప్రకటన వచ్చే వరకు తెలియదు ఇందులో ఎంత నిజం ఉందో.

ఫుల్ క్రేజ్...:ఇక వైష్ణవి నటించిన బేబీ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఇక తన పాత్ర వేరియెషన్స్ చూసి నెటిజన్స్.. షాక్ అవుతున్నారు. బయట కూడా ఇలా అమ్మాయిలు ఉన్నారంటూ మండిపడుతున్నారు. మరోవైపు కొంతమంది సినిమాలో లీనమై.. వైష్ణవిని కూడా తిడుతున్నారు. మొత్తానికి ఈ సినిమాకు యూత్ లో బాగా క్రేజ్ వస్తోంది.


Click it and Unblock the Notifications











