బేబి రీమేక్ రైట్స్‌కు అదిరిపోయే ఆఫర్స్.. అలా భారీగా ప్లాన్ చేసిన నిర్మాతలు
రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు ఆనంద్ దేవరకొండ. దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ తనదైన శైలీలో మెప్పించే ప్రయత్నం చేశాడు. ఇక ఇటీవల విడుదలైన బేబీ (Baby 2023) సినిమా ఎక్కడా లేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇందులో ఆనంద్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక ఒక సినిమా బ్లాక్ బస్టర్ హట్ అవడంతపాటు ప్రేక్షకులను బాగా హత్తుకుంటే.. దాన్ని రీమేక్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్స్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో బేబి సినిమా రీమెక్స్ హక్కుల కోసం భారీ ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయని సమాచారం.
జూలై 14న: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ బేబి (Baby). 2017లో అర్జున్ రెడ్డి, 2018 ఆర్ఎక్స్ 100 చిత్రాలు ఎలాగే 2023లో బేబి సినిమా అన్నట్లుగా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు బేబి సినిమాపై ఫుల్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. జూలై 14న విడుదలైన ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది. ఫలితంగా వసూళ్ల పరంపర కొనసాగిస్తోంది.

స్టీఫెన్ శంకర్: ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఎమోషనల్ కాన్సెప్టుతో వచ్చిన బేబి సినిమాకు సంపూర్ణేష్ బాబుతో హృదయ కాలేయం, కొబ్బరి మట్ట సినిమాల దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించారు. ఈ చిత్రాలను సాయి రాజేష్ ఇంతకుముందు స్టీఫెన్ శంకర్ అనే పేరుతో డైరెక్ట్ చేశాడు. ఇక బేబి సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. డైరెక్టర్ మారుతీ, ఎస్‍కేఎన్ (శ్రీనివాస కుమార్) సంయుక్తంగా మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించారు.

ఇతర భాషల్లో: ఒక చిన్న సినిమాగా విడుదలైన బేబి సినిమా అత్యధిక వసూళ్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే రూ. 70 కోట్లకుపైగా గ్రాస్ కలెక్ట్ చేసి సత్తా చాటింది. అయితే మంచి ప్రేక్షకాదరణ పొందిన సినిమాలను ఇతర భాషల్లో రీమేక్ చేస్తారన్న విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన ఓ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. బేబి సినిమాకు పొరుగు భాషల నుంచి మేకర్స్ కు ఫ్యాన్సీ ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం.

భారీగా ప్లాన్: అయితే బేబి రీమేక్ హక్కుల కోసం భారీ ఆఫర్లు వస్తున్న ఇంతవరకు చిత్ర నిర్మాత SKN తుది నిర్ణయం ఏం తీసుకోలేదట. బేబి తమిళం, హిందీ భాషల రీమేక్స్ రైట్స్ పై త్వరలోనే క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మేకర్స్ ఇంకా చర్చలు జరుపుతున్నారట. అయితే హిందీ, తమిళ రీమేక్ లో బేబి సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నాట మేకర్స్. అలా అయితే మరింత లాభాలు వచ్చే అవకాశం ఉందని టాక్.
ఓటీటీలో ఎప్పుడంటే?: ఇదిలా ఉంటే మొదటి రోజు నుంచి మంచి టాక్ తెచ్చుకుంటున్న బేబి సినిమా ఆగస్టు మొదటి వారంలోనే ఓటీటీలోకి రావాల్సి ఉంది. కానీ, సినిమాకు వస్తున్న రెప్సాన్స్ చూసి మేకర్స్ దాన్ని వాయిదా వేశారు. దీంతో బేబి సినిమాను ఆగస్టు చివరి వారంలో, లేదా సెప్టెంబర్ మొదటి వారంలో డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











