బాలయ్య అభిమానులకు బ్యాడ్ న్యూస్?
ఇది నిజంగా బాలయ్య అభిమానులకు బ్యాడ్ న్యూస్ లాంటిదే. బాలయ్య నటించిన 'అధినాయకుడు' చిత్రం ఈ నెల 12న విడుదలవుతుందనే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం విడుదల మరింత ఆలస్యం కావచ్చే ప్రచారం సాగుతోంది.
ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్నే అధినాయకుడు సినిమా 'A' సర్టిఫికెట్ పొందింది. అయితే సినిమాకు సంబంధించిన కొన్ని ఫైనాన్సియల్ సమస్యలు సాల్వ్ కావాల్సి ఉందని, ఆ కారణంగానే సినిమా విడుదల ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు. ఏప్రిల్ 19న సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
అధినాయకుడు చిత్రంలో బాలయ్య తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. లక్షీరాయ్, సలోని ఇందులో కథానాయికలు. పరుచూరి మురళి దర్శకత్వంలో శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్. కుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ముసలి గెటప్‌లో ఉండే బాలయ్య పాత్ర...పరోక్షంగా మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేస్తుందని, ఆయనపై ఇండైరెక్టుగా రాజకీయ విమర్శలు చేస్తారని తెలుస్తోంది.
జయసుధ, సలోని, లక్ష్మీరాయ్ బాలయ్య మూడు పాత్రలకు జోడీలుగా నటిస్తున్నారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్‌రాజ్, ఎమ్మెస్‌నారాయణ, వేణుమాధవ్, ఆదిత్యమీనన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: సందీప్, నిర్మాత: ఎం.ఎల్. కుమార్ చౌదరి, దర్శకత్వం: పరుచూరి మురళి.


Click it and Unblock the Notifications











