బన్నీ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్
హైదరాబాద్: బన్నీ తాజా చిత్రం 'ఇద్దరమ్మాయిలతో' ట్రైలర్ చూసిన దగ్గరనుంచి వారంతా ఆడియో విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఏప్రియల్ 21 న ఆడియో విడుదల తేదీని ప్రకటించారు. అయితే ఇప్పుడు కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదావేసే అవకాసముందని విశ్వసనీయ సమాచారం. త్వరలోనే ఆడియో విడుదల కొత్త తేదీని ప్రకటిస్తారని తెలుస్తోంది. పాటలు మాత్రం బన్ని కెరీర్ లో నే బెస్ట్ గా నిలిచేలా వచ్చాయని చెప్తున్నారు.
అల్లు అర్జున్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఇటీవల ఈచిత్రం ట్రైలర్‌ను విడుదల చేసారు. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇంతకు ముందు 'దేశముదురు' చిత్రంలో అల్లు అర్జున్‌ను సరికొత్తగా ప్రజెంట్ చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్ తాజాగా 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో బన్నీని సరికొత్తగా చూపించబోతున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో బన్నీ చేసే యాక్షన్ సీన్స్ హాలీవుడ్ లెవల్లో ఉండనున్నాయి.
బన్నీ సరసన అమలపాల్, కేథరిన్ నటిస్తున్నారు. స్పెయిన్ దేశంలో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రానికి సంబంధించిన మేజర్ పార్ట్ చిత్రీకరిస్తున్నారు. ఈచిత్రంలో అల్లు అర్జున్ తన ఒంటిపై టాటూలతో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు.
ఇందులో థాయ్ ఫైట్ మాస్టర్ కేచ కంపక్డీ కంపోజ్ చేసిన ఫైట్స్ హైలెట్ కానున్నాయి. ఈ సినిమాలో మొత్తం 6 యాక్షన్ సీక్వెన్స్ కంపోజ్ చేసాడట కెచె. ఇందుకుగాను అతనికి నిర్మాత బండ్ల గణేష్ భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చాడని టాక్. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, నృత్యాలు: దినేష్, కళ: చిన్నా, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్ వర్మ, నిర్మాత: బండ్ల గణేష్, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











