మళ్ళీ త్రివిక్రమ్ అదే పొరపాటు: పవన్, మహేశ్‌కు ఫ్లాప్స్.. భయపెడుతున్న బ్యాడ్ సెంటిమెంట్..
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కాంబినేషన్స్ అనేవి ప్రేక్షకుల్లో అంచనాల స్థాయిని ఎలా పెంచుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు దర్శకుడు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ సినిమాలకు డైరెక్షన్ చేయకపోయినప్పటికీ కూడా తన రచన సహకారంతో పవన్ కళ్యాణ్ సినిమాలపై అంచనాలను పెంచేస్తున్నారు. అయితే మరోవైపు మహేష్ బాబుతో మరో సినిమాను తెరపైకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ కాంబినేషన్ బాగానే ఉన్నప్పటికీ కూడా ఒక బ్యాట్ సెంటిమెంట్ అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ సెంటిమెంట్ నిజమైతే మహేష్ పవన్ ఇద్దరికీ కూడా డిజాస్టర్స్ వస్తాయేమో అని అనుకుంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

ఇద్దరితో ఎప్పుడు వర్క్ చేసినా..
టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో హీరో క్యారెక్టర్ ను జనాలకు చాలా బలంగా కనెక్ట్ అయ్యేలా చేస్తూ ఉంటాడు. ఇక మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఇద్దరి కెరీర్ లో కూడా చెప్పుకోదగ్గ సినిమాలలో త్రివిక్రమ్ సినిమాలు టాప్ లిస్టులో ఉంటాయని చెప్పవచ్చు. ఈ ఇద్దరితో ఎప్పుడు వర్క్ చేసినా కూడా ఆ బజ్ కూడా మామూలుగా ఉండదు.

చాలా గ్యాప్ తరువాత
పవన్ కళ్యాణ్ తో ఇదివరకే జల్సా అత్తారింటికి దారేది సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకున్న త్రివిక్రమ్ 3వ సినిమా అజ్ఞాతవాసి తో మాత్రం డిజాస్టర్ ఎదుర్కొన్నాడు. అయితే మహేష్ బాబుతో అతడు ఖలేజా సినిమాలు చేసిన త్రివిక్రమ్ చాలా గ్యాప్ తర్వాత మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. SSMB 28వ సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

మరో రీమేక్
అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో కూడా త్రివిక్రమ్ ఒక సినిమాకు వర్క్ చేస్తున్నాడు. తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న వినోదాయ సీతం రీమేక్ కోసం త్రివిక్రమ్ రచన సహకారం అందిస్తున్న విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు సముద్రఖని ఈ రీమేక్ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా సాయి ధరంతేజ్ మరొక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. బుధవారం రోజు అధికారికంగా ఈ సినిమాను లాంచ్ చేసిన విషయం తెలిసిందే.

ఖలేజా టైమ్ లో..
అయితే ఈ ప్రాజెక్టు విషయాలలో మాత్రం ఊహించని విధంగా కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఒక బ్యాడ్ సెంటిమెంట్ ఎక్కువ స్థాయిలో వైరల్ అవుతుంది. ఎందుకంటే గతంలో త్రివిక్రమ్ ఖలేజా సినిమాను డైరెక్టర్ చేస్తున్నప్పుడు మరోవైపు పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో తీన్ మార్ సినిమాకు కూడా రచయితగా వర్క్ చేయడం జరిగింది. అది బాలీవుడ్ సినిమాకు రీమేక్ గా వచ్చింది.

మళ్ళీ అదే బ్యాడ్ సెంటిమెంట్
ఇక ఖలేజా సినిమాతో పాటు తీన్మార్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. ఆ సినిమాలు ఆ స్థాయిలో నష్టాలు తెస్తాయి అని ఎవరు కూడా ఊహించలేదు. అయితే ఇప్పుడు మళ్లీ మహేష్ బాబు 28వ సినిమాతో పాటు త్రివిక్రమ్ పవన్ వినోదాయ సీతం రీమేక్ కోసం రైటర్ గా డైలాగ్స్ అందిస్తున్నాడు. ఈ తరహా కాంబినేషన్ అనేది బ్యాడ్ సెంటిమెంట్ గా వెలుతోంది. అదే నిజమైతే ఇద్దరికి డిజాస్టర్ వస్తుందేమో అనే విధంగా మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మరి ఈ కాంబో ఈసారి ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











