»   » దర్శకుడు శ్రీను వైట్ల.... ఇన్ని కష్టాలకు కారణం అదే!

దర్శకుడు శ్రీను వైట్ల.... ఇన్ని కష్టాలకు కారణం అదే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పుడు దర్శకుడు శ్రీను వైట్ల అంటే హిట్ సినిమాల దర్శకుడు. ఆయనతో సినిమాలు తీస్తే లాభాలు గ్యారంటీ అని నమ్మే నిర్మాతలు ఓ వైపు, ఆయన సినిమాలో నటిస్తే బావుండు అని కోరుకునే హీరో హీరోయిన్ల మరో వైపు. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు.

ఆగడు సినిమాతో శ్రీను వైట్ల కెరీర్లోనే భారీ ప్లాప్. ఆ తర్వాత రామ్ చరణ్ తో చేసిన ‘బ్రూస్ లీ' సినిమా కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. ఈ సినిమాతో మళ్లీ ఫాంలోకి వస్తానని ఆశలు పెట్టుకున్న శ్రీన వైట్లకి నిరాశే మిగిలింది. మూలిగే నక్కమీద తాడిపండు పడ్డట్లు భార్యతో గొడవలు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్.

Bad Time: Srinu Vytla house is main Reason

మరో వైపు బ్రూస్ లీ సినిమాకు శ్రీను వైట్లతో కలిసి పని చేసిన రచయిత కోన వెంకట్ కూడా రివర్స్ అయినట్లు సమాచారం. బ్రూస్ లీ సినిమా విషయంలో తనకు రాంగ్ క్రెడిట్ అంటగడుతున్నారంటూ శ్రీను వైట్లపై రూ. 10 కోట్ల పరువునష్టం దావా వేసేందుకు సిద్దమవుతున్నారట.

శీను వైట్లకు ఇలా కష్టాల మీద కష్టాలు ఎందుకు వస్తున్నాయో తెలిసి పోయింది. అతను కొత్తగా కట్టుకున్న బంగ్లానే ఈ పరిణామాలకు కారణమంట. ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి శ్రీనువైట్లకు అస్సలు కలసి రావడం లేదట. అందువల్లనే సినిమాలు ఫ్లాప్ కావడంతో పాటు భార్యతో మనస్పర్థలు రావడం, ఇతర గొడవలు అంటున్నారు. అందుకే శ్రీను వైట్ల తన ఇష్టపడి కట్టుకున్న బంగ్లాను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడట. అయితే శ్రీను వైట్ల పరిస్థితి ఆ ఇంటిని కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదట.

English summary
Bad Time for Director Srinu Vytla. Main Reason is his new house.
Please Wait while comments are loading...