రేపు రిలీజ్ కానున్న‘బద్రినాథ్’పై వివాదం-ఫ్యాన్స్, డిస్ట్రిబ్యూటర్స్ టెన్షన్ టెన్షన్...!?

By Sindhu

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం బద్రినాథ్ విడుదలకు కర్ణాటకలో ఆటంకాలు ఏర్పడ్డాయి. సినిమా విడుదలను నిలిపి వేయాలని ఒక ప్రముఖ కన్నడ నిర్మాత న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. ఈ విషయం బుధవారం వెలుగు చూడటంతో తెలుగు సినీ ప్రేక్షకులు సహా మెగాస్టార్ అభిమానులు తీవ్రనిరాశకు గురయ్యారు. కర్ణాటకలో బద్రినాథ్ సినిమా విడుదలకు న్యాయస్థానం అనుమతి ఇవ్వలేదని బుధవారం పలు చానెళ్లలో వార్తలు గుప్పుమన్నాయి. బద్రినాథ్ పంపిణీ హక్కులు తనకు ఇస్తామని మాట ఇచ్చారని, తన దగ్గర రూ. లక్షలు తీసుకున్నారని బెంగళూరుకు చెందిన ఓ నిర్మాత ఆరోపిస్తున్నారు. సినిమా విడుదలపై వివాదం ఏర్పడటంతో ఇప్పటికే బెంగళూరు నగరం సహా కర్ణాటకలో బద్రినాథ్ ప్రదర్శనకు హక్కులు తీసుకున్న థియేటర్ యజమానులు హడలిపోతున్నారు.

బుధవారం గీతా ఆర్ట్స్‌కు చెందిన ప్రతినిధులు బెంగళూరుకు వచ్చి, ఇక్కడి ఫిలిం ఛాంబర్‌కు చేరుకుని కర్ణాటక చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు బసంత్‌ కుమార్ పాటిల్, ప్రముఖ నిర్మాత సా.రా. గోవిందు తదితరులతో మంతనాలు సాగించారు. కోర్టు నుంచి స్టే తెచ్చుకున్న నిర్మాతను కర్ణాటక చలన చిత్ర వాణిజ్య మండలి కార్యాలయానికి పిలిపించి చర్చలు జరపడానికి ప్రయత్నించారు. అయితే ఆయన అందుబాటులో లేకపోవడంతో గురువారం చర్చిస్తామని ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు చెప్పడంతో గీతా ఆర్ట్స్ ప్రతినిధులు వెనుదిరిగారు. బెంగళూరుకు చెందిన డిస్ట్రిబ్యూటర్లకు సినిమా పంపిణీ హక్కులు ఇవ్వకుండా స్వయంగా గీతా ఆర్ట్స్ సంస్థ విడుదల చేస్తున్నందున ఈ సమస్య వచ్చిందని సినీ వర్గాలు అంటున్నాయి. చర్చలు ఫలించకపోవడంతో గురువారం ఉదయం నుండి ఫిల్మిం చాంబర్ లో చర్చలు జరుపుతున్నారు. సాయంత్రంలోపు చర్చలు ఫలించి ఎలాంటి గొడవ లేకుండా సినిమా విడుదలకు ప్రయత్నాలు మమ్మురం చేస్తున్నారు. కర్నాటకాలో ఎన్నడూ లేని విధంగా పబ్లిసిటి కూడా భారిగా ఇచ్చారు. మొత్తం మీద వివాదానికి సాయంత్రంలోపు తెరపడుతుందని, శుక్రవారం (జూన్ 10)విడుదల కావడం ఖాయమని వారు ఘంటాపథంగా చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X