'బద్రీనాథ్' మరో మగధీరకానుందా..
గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ వివి వినాయక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో నిర్మించనున్న 'బద్రీనాథ్" చిత్ర నిర్మాణం కోంచెం అలస్యం అవనుంది. కోంత కాలం క్రితం వివి వినాయక్ తండ్రి ఆకస్మికంగా మృతి చెందారు. ప్రస్తుతం జరుగుతున్న కధ చర్చలలో వినాయక్ పాల్గోనడం లేదని సమాచారం. చిన్నికృష్ణ, అల్లు అరవింద్, అర్జున్ తదితరులు కధచర్చలలో పాల్గోంటున్నారని సమాచారం అయితే దర్శకుడు లేకుండా ఏమిటి చర్చలు అని సినీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఏమైనా ఈ సినిమా తెలుగు ఇండస్ర్టీలో సంచలన విజయం సాదిస్తుందని చర్చ మోదలైయ్యింది. మరో పక్క చిన్నికృష్ట ఈ సినిమాను చాలెంజ్ గా తీసుకున్నామని ఇప్పటికే అంటున్నారు. తాను ఈ సినిమా కధ గురించి ఏంతో శ్రద్ద తీసుకున్నానని అంటున్నారు. ఈ సినిమా మరో మగధీర కావాలని చిరు అభిమానులు అంటున్నారు.
అల్లు అర్జున్ వివి వినాయక్ బద్రీనాథ్ మగధీర చిన్నికష్ణ అల్లు అరవింద్ allu arjun vv vinayak badrinath magadheera chinni krishna allu aravind


Click it and Unblock the Notifications