»   » 'బాహుబలి-2' ... మళ్లీ కేరళలో

'బాహుబలి-2' ... మళ్లీ కేరళలో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తెలుగు ప్రేక్షకులను అబ్బరపరిచిన సిల్వర్ స్క్రీన్ అద్బుతం బాహుబలి. దీనికి సీక్విల్ గా రుపొందుతున్న బాహుబలి - 2 (ది కంక్లుజన్) షూటింగ్ కొద్దికాలం క్రితమే హైదరాబాద్ లో మెదలైంది.

ఇప్పుడు ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ స్పాట్స్ ను వెతుకుంటూ రాజమౌళి అండ్ టీం బయలుదేరింది. ప్రస్తుతం ఈ టీం కన్నూర్, కేరళ మెదలైన ప్రదేశాలలో తిరుగుతున్నట్లు సమచారం.


ముఖ్యంగా ఈ సినిమా కు సంబందించిన సినిమాటోగ్రాఫర్, కె.కె.సెంథాల్ కుమార్ దీనికోసం చాలా కష్టపడుతున్నారు. బాహుబలి ఫస్టపార్ట్ సీన్స్ అక్కడే తీయాడంతో మళ్ళీ అక్కడే మరికొన్ని అవసరమైన సీన్స్ తీసి బాహుబలికి కి మరింత క్రేజ్ తీసుకురానున్నారు.


ఇక్కడ షూటింగ్ ప్లాన్ చేయటానికి మరొక కారణం ...అక్కడ లోకేషన్స్ ఎంతో అద్బుతంగా ఉండటంతో పాటు, ఖర్చు కూడా కలిసి వస్తుందని ఈ ఆలోచన చేస్తున్నారు. దీనితో ఈ సినిమా చాలా త్వరగా పూర్తవుతుందని సమాలోచన చేస్తున్నారు.


 Bahubali 2 team went to Kerala

ఇంతకు ముందే కొంత మెదటిపార్టులోనే షూటింగ్ కంప్లీట్ చేసిన ఈ సినిమాకు కావలసిన మిగతా 40% త్వరగా పూర్తి చేయ్యాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.


'బాహుబలి' రెండో భాగం ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తికరమైన అంశం. ఈ చిత్రానికి ''బాహుబలి - ది కంక్లూజన్‌' అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో మొదటి భాగంలో ఉన్న సందేహాలు అన్నీ కంక్లూజన్ దొరుకుతుందనే ఈ టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం గురించి సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.


'బాహుబలి 2' గురించి రానా మాట్లాడుతూ... ''బాహుబలి - ది కంక్లూజన్‌' వచ్చాక 'బాహుబలి - ది బిగినింగ్‌' చాలా చిన్నదిగా కనిపిస్తుంది. రెండో భాగంలో పోరాట సన్నివేశాలు, భావోద్వేగాలు, సెట్లు... ఇలా అన్నీ ఇంకా భారీగా ఉంటాయి''అన్నాడు రానా. టైటిల్ తో పాటు అన్ని విషయాల్లోనూ అత్యంత భారీతనం కనిపించిన బాహుబలి చిత్రం కలెక్షన్లను కూడా భారీగానే కొల్లగొట్టి సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది.

English summary
‘Baahubali’ - The Conclusion makers are planning to shoot some portion of the film in Kannur, Kerala.
Please Wait while comments are loading...