Prabhas Heroine: కట్టప్పతో ప్రభాస్ భామ లవ్ ఎఫైర్... మరో హీరో ఎంట్రీతో సీన్ రివర్స్!

స్టార్ సెలబ్రేటీల గురించి నిత్యం ఏదో ఓ వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో వారిపై గాసిప్స్ వస్తునే ఉంటాయి. కొన్ని హద్దు మీరి గాసిప్స్ పుట్టిస్తుంటారు సోషల్ మీడియా యూజర్స్. ఇప్పుడు మరో వార్త తెరమీదకు వచ్చింది. అందులో ఎంత నిజం ఉందో తెలియదు.. కానీ ఆ న్యూస్ మాత్రం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ప్రభాస్ హీరోయిన్ తో బహుబలి యాక్టర్ సత్య రాజ్ ప్రేమాయణం నడిపారని... అయితే ఓ హీరో ఎంట్రీతో వారి ప్రేమకు బ్రేకులు పడ్డట్లు ప్రస్తుతం నెట్టింట్లో ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. అసలు ఆ హీరోయిన్ ఎవరు.. ఆ హీరో ఎవరు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక... త్రో బ్యాక్ జ్ఞాపకాలు ఇప్పుడు మరోసారి ట్రెండ్ అవుతున్నాయి. అయితే అలాంటి న్యూస్ ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. బహుబలి సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న నటుడు సత్య రాజ్. ఆయన ఇంతకు ముందే ప్రభాస్ తో కలిసి మిర్చి సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక బహుబలి సిరీస్ తో ఆయన క్రేజ్ మరింత పాపులర్ అయింది. అయితే ఆయన ఒకప్పుడు స్టార్ హీరో.

Bahubali Actor Satyaraj Love Affair With Prabhas Heroine Namitha News Goes Viral

ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి సినిమాలు చేస్తున్నారు. ఒకప్పుడు హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు. అంతే కాదు.. మల్టీ స్టారర్ సినిమాలు చేశాడు. ఇదిలా ఉంటే.. ఆయన గురించి ఓ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఎప్పటి స్టోరీనో ఇప్పుడు వైరల్ గా మార్చుతున్నారు కొంత మంది. కట్టప్పగా తెలుగు ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ తెచ్చుకున్న ఈయన.. ఒకప్పుడు ప్రభాస్ హీరోయిన్ తో లవ్ ఎఫైర్ నడిపారంటూ ట్రెండ్ చేస్తున్నారు.

ప్రభాస్ హీరోయిన్ నమిత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ భామ ప్రభాస్ తో కలిసి బిల్లా అనే సినిమాలో నటించింది. బోల్డ్ క్యారెక్టర్ లో ప్రభాస్ కు జోడిగా నటించింది. అయితే నమిత చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చింది. డిగ్రీ పూర్తవ్వకుండానే మోడలింగ్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వ్యాపార ప్రకటనల్లో మోడల్ గా నటించింది. ఆ తర్వాత ఈ భామకు సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. ఇక తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించింది.

Bahubali Actor Satyaraj Love Affair With Prabhas Heroine Namitha News Goes Viral

అలా సత్య రాజ్ తో కూడా చాలా సినిమాల్లో నటించింది. దీంతో వీరి మధ్య ఏదో ఉందంటూ వార్తలు మొదలు అయ్యాయి. వీరి మధ్య లవ్ ఎఫైర్ కూడా నడిచిందని వార్తలు వచ్చాయి. అంతే కాదు వీరు డేటింగ్ కూడా చేశారని.. వీరు పెళ్లి చేసుకుందాం అనుకునే లోపే.. ఇంకో హీరో ఎంట్రీతో వారి ప్రేమ బ్రేకప్ అయిందట. ఆ హీరో ఎవరో కాదు.. శరత్ కుమార్. ఈ న్యూస్ కోలీవుడ్ లో అప్పట్లో వైరల్ అయింది.

శరత్ కుమార్ ఎంట్రీతో వీరి మధ్య లవ్ ఎఫైర్ కు బ్రేక్ పడిందని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.. కానీ ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కట్టప్ప.. ప్రభాస్ హీరోయిన్ తో డేటింగ్ చేశారంటూ వైరల్ చేస్తున్నారు. ఇక సత్య రాజ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజి బిజీగా గడుపుతున్నారు. ఇక నమిత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X