వైఎస్ఆర్ బయోపిక్ లో బాహుబలి నటి, నయనతార, రాధిక ఆప్టే తప్పుకున్నారు!
Recommended Video

పాటశాల, ఆనందోబ్రహ్మ సినిమాలకు దర్శకత్వం వహించిన మహిత్ రాఘవ వైఎస్ఆర్ బయోపిక్ కు దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే నెల నుండి ప్రారంభం కానుంది. తాజా సమాచారం మేరకు ఈ బయోపిక్ లో బాలివుడ్ నటి నటించబోతున్నట్లు సమాచారం.

యాత్ర ప్రారంభం కానుంది
వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ ను దర్శకుడు మహిత్ రాఘవ తెరకేక్కిస్తున్నాడు. గతంలో ఈ డైరెక్టర్ పాటశాల, ఆనందోబ్రహ్మ సినిమాలకు దర్శకత్వం వహించడం జరిగింది. తాజాగా ఈ డైరెక్టర్ వైఎస్సార్ బయోపిక్ ను డైరెక్ట్ చెయ్యబోతుండడం విశేషం. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే నెల నుండి ప్రారంభం కానుంది.

ఫస్ట్ లుక్ కు ఆదరణ
రాజశేఖర్ రెడ్డి పాత్రలో తెలుగు హీరోలయితే నప్పరని, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిని సంప్రదించారనీ, ఆయనకు వైఎస్సార్ చరిత్ర మొత్తం చెప్పి సినిమాలో నటింపజేసేందుకు అంగీకరింపజేశారు. కాగా ఈ సినిమాకు యాత్ర అనే పేరు ఖరారు చేసారు. ఇటివల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ లభించింది.

నయనతార, రాధికా ఆప్టే కాదు
ఈ సినిమాలో నటించే పాత్రలకు నటీనటుల ఎంపిక జరుగుతోందట. ఇందులో ముఖ్యమైన విజయమ్మ పాత్రలో నయనతార నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. రాధికా ఆప్టే కూడా పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కాని వారిద్దరు ఈ పాత్ర చెయ్యడం లేదని తెలుస్తోంది.

విజయమ్మ పాత్రలో బాహుబలి నటి
తాజా సమాచారం మేరకు ఆశ్రిత వేముగంటి ఈ సినిమాలో విజయమ్మ పాత్రలో నటించవచ్చని సమాచారం. బాహుబలి సినిమాలో కన్నా నిదురించర పాత్రలో ఈ నటి డాన్స్ చేసింది. ఈ నటి అయితే బాగుంటుందని భావించిన చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించడం జరిగినట్లు సమాచారం. త్వరలో ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











