Devara: దేవర కోసం బాహుబలి ఐటమ్ బాంబ్.. తారక్, కొరటాల కేక పుట్టించేలా!

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా వైడ్ గా మన తెలుగు సినిమా హీరోల హవా బాగా నడుస్తుంది. దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి చేసిన భారీ చిత్రం బాహుబలి వేసిన ముద్రతో అయితే ఇప్పుడు అనేకమంది స్టార్ హీరోలు తమ స్టార్డం ని పాన్ ఇండియా వైడ్ గా తీసుకెళ్తున్నారు. ఇక దీని తర్వాత జక్కన్న చేసిన "ఆర్ ఆర్ ఆర్" తో ఆ సినిమా హీరోలు కూడా పాన్ ఇండియా మార్కెట్ పై కన్నేయగా ఇందులో టాలెంట్ పవర్ హౌస్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకడు.

కాగా తారక్ పోస్ట్ RRR సినిమా చేస్తున్న సినిమానే "దేవర". పూర్తిగా ఒక మాస్ యుఫొరియా కలిగిన భారీ చిత్రంగా దీనిని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. కొరటాల కెరీర్ లో అతిపెద్ద డిజాస్టర్ "ఆచార్య" లాంటి సినిమా తర్వాత వస్తున్నప్పటికీ దీనిపై ఆ ఎఫెక్ట్ ఏమాత్రం కనిపించడం లేదు. అయితే ఈ సినిమా ఇప్పుడు దాదాపు పూర్తి కావచ్చింది.

Bahubali hot girl special song in ntrs devara movie

మరి ఈ సినిమాలో బాలీవుడ్ నటీనటులు కూడా ఉన్నారు. హీరోయిన్ గా జాన్వీ కపూర్, విలన్ గా సైఫ్ అలీఖాన్ లాంటి బిగ్ స్టార్స్ నే కొరటాల పట్టుకోగా ఇప్పుడు మరో బాలీవుడ్ బిగ్ సెలెబ్ ని తాను పట్టుకున్నట్టుగా కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం అయితే కొరటాల బాలీవుడ్ హాట్ సెన్సేషన్ నోరా ఫతేహి ని ఎంపిక చేసినట్టుగా వినిపిస్తుంది.

కాగా నోరా కి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. అంతే కాకుండా ఈమె ప్రభాస్ బాహుబలి లో కూడా మనోహరి సాంగ్ లో మెరిసింది. దీనితో ఈమెతో ఇపుడు దేవర లో సాంగ్ చేయనున్నారని తాజా సమాచారం. ఇక ఈ సాంగ్ షూటింగ్ కూడా అతి త్వరలోనే మొదలు పెట్టనున్నారట. మొత్తానికి అయితే కొరటాల గట్టి ప్లానింగ్ లతోనే సినిమాని సిద్ధం చేస్తున్నాడని చెప్పాలి.

ఇంకా ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా తాను ఇచ్చిన ఫస్ట్ సింగిల్ ఆల్రెడీ మంచి హిట్ అయింది. ఇక ఈ ఐటెం నెంబర్ ని అనిరుద్ ఏ లెవెల్లో అందించాడో చూడాలి. అనిరుద్ కెరీర్ లో ఐటెం సాంగ్స్ లాంటివి చాలా తక్కువే చేసాడు కానీ చేసినవి అన్నీ కూడా మంచి చార్ట్ బస్టర్స్ అయ్యాయి.

Devara

ఇక దేవరకి ఎం చేస్తాడో చూడాలి. కాగా ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అనే కొత్త బ్యానర్ లు కలిసి నిర్మాణం వహిస్తుండగా ఈ ఏడాది సెప్టెంబర్ 27న సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా భాషలు తెలుగు, తమిళ్, కన్నడ మలయాళ సహా హిందీలో విడుదల కాబోతుంది.

More from Filmibeat

Read more about: jr ntr nora fatehi devara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X