»   » 'బాహుబలి' ...ప్రేక్షకులకు భారీ షాక్ ఇవ్వబోతోందా

'బాహుబలి' ...ప్రేక్షకులకు భారీ షాక్ ఇవ్వబోతోందా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'బాహుబలి' . ఈ చిత్రం రేట్లు పెంచి ప్రేక్షకులకు షాక్ ఇవ్వబోతోందని ట్రేడ్ వర్గాల్లో వినపడుతోంది. ఈ చిత్రానికి పెట్టిన భారి బడ్జెట్ ను రికవరీ చేసుకోవటానికి టిక్కెట్ రేట్లును భారీగా పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్స్ , ఎగ్జిబిటర్స్ తో ఇప్పటికే రెండు మూడు ధఫాలుగా మాట్లాడారని వినికిడి. ఇక ఇప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి ఫర్మిషన్ తీసుకోవటమే తరువాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడుఈ మేరకు ...బాహుబలి నిర్మాత...ఇండస్ట్రీలోని సిని పెద్దలు కొందరితో కలిసి...తెలంగాణా ఐటి మినిస్టర్ కె.టి రామారావుని కలిసి...హైక్ ప్రపోజల్ ని పెట్టనున్నారని చెప్పుకుంటున్నారు. ఒక్కసారి గవర్నమెంట్ ఎప్రూవ్ చేస్తే..నైజాం ఏరియాలో రేట్లు పెరుగుతాయి. అంతేకాదు...రెండు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్స్ రేట్లు అమాంతం పెంచుతారు.


చెన్నై,బెంగుళూరు, న్యూడిల్లీలలో ఇప్పటికే రేట్లు పెంచారని ఒప్పిస్తారని అనుకుంటున్నారు. ఈ మేరకు గవర్నమెంట్ ఒప్పుకుంటే మల్టిప్లెక్స్ లు 150 నుంచి 250కు పెంచుతాయి. అలాగే వీకెండ్స్,రిలీజ్ రోజు...రెట్టింపు చేస్తారు సింగిల్ ధియోటర్ వారు.


మంత్రి ఇప్పుడు సిటీలో లేరని, వచ్చీ రాగానే ఈ ప్రపోజల్ పెడతారని తెలుస్తోంది. తాము పెట్టిన పెట్టుబడిని అతి తక్కువ కాలంలో రికవరీ చేసుకోవలంటే ఇదే సరైన ఆలోచనగా బావిస్తున్నట్లు సమాచారం. రేట్లు పెంచితే ఎక్కువ రేటు కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ సైతం లాభాలు గడిస్తామని, టెన్షన్ పడరని భావిస్తున్నారు.


 Bahubali plans to hike ticket price

ఇక గతంలో జై చిరంజీవ సమయంలోనూ ఇలా..రేట్లు పెంచారు. అప్పుడు స్పెషల్ జీవో తెచ్చుకుని సినిమా రేట్లు పెంచారు. అయితే చాలా చోట్ల ఆ ఒక్క సినిమాకే కాక తర్వాత వచ్చే ప్రతీ సినిమాకు రేట్లు పెంచటం మొదలైంది. దాంతో ప్రేక్షకుడు భయపడే సిట్యువేషన్ ఏర్పడుతోంది.


చిత్రం విశేషాలకు వస్తే....


ఆడియో లాంచ్ లో రిలీజ్ చేయనున్న ఫైనల్ ట్రైలర్ కట్ రెడీ అయ్యింది. ట్రైలర్ కి సంబందించిన సెన్సార్ కూడా పూర్తయ్యిందని, సెన్సార్ వారు ‘యు/ఏ' ఇచ్చారని ఆ చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ తెలిపాడు. ఈ ట్రైలర్ రన్ టైం 2 నిమిషాలు ఉంటుందని సమాచారం.


ఇప్పటికే ఈ చిత్రానికి సంభందించిన పోస్టర్స్ బయిటకు రావటంతో అందరిలో ఓ రేంజిలో ఆసక్తి పెరిగింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఆడియోపై అనంతమైన అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ ఆడియోకు తమిళ,తెలుగు,హిందీ పరిశ్రమల నుంచి ప్రముఖులు వస్తూండటంతో ఆడియో లైవ్ రైట్స్ కు కూడా బాగా డిమాండ్ ఏర్పడింది. చిత్ర ఆడియో ప్రత్యక్ష ప్రసారాలను ప్రసారం చేసేందుకు అన్ని ఛానెల్స్ పోటీ పడ్డాయి.


అయితే తెలుగు న్యూస్ ఛానల్ టీవీ5 భారీ ధర చెల్లించి ప్రత్యక్ష ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. ఈ రేటు ఒక కోటి అని తెలుస్తోంది. కోటి రూపాయలు ఓ ఆడియో పంక్షన్ టెలీకాస్ట్ రైట్స్ కు పలకటం సాధారణ విషయం కాదు అంటున్నారు.


తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా జులై 10న 3500 థియేటర్లలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా ప్రచారాన్ని చిత్రబృందం వినూత్నంగా నిర్వహిస్తోంది.ఇందులో భాగంగా సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అభిమానులకు పరిచయం చేయడానికి కేన్స్‌ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని వేదికగా చేసుకొంది. శోభు యార్లగడ్డ, ఛాయాగ్రాహకుడు కె.కె.సెంథిల్‌కుమార్‌, ఎస్‌.ఎస్‌.కార్తికేయ ఆధ్వర్యంలో ఓ బృందం కేన్స్‌కు వెళ్లింది. అక్కడ కేన్స్‌ ప్రతినిధి క్రిస్టియన్‌ జేన్‌ను కలిశారు.


ఈ సందర్భంగా శోభు యార్లగడ్డ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ ''బాహుబలి' రెండు భాగాలు కలిపి 290 నిమిషాల నిడివి ఉంటుంది. అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం సినిమా నిడివి తగ్గించి విడుదల చేస్తాం. ఈ సినిమాను భారతీయ పురాణాల నేపథ్యంలో తెరకెక్కించలేదు. ఇది పూర్తిగా కొత్త కథ'' అని చెప్పారు. ఈ సినిమా అంతర్జాతీయ ప్రచారం కోసం ఫ్రంట్‌నైట్‌ సంస్థ అధిపతి ఫ్రాంకోయిస్‌ డ సిల్వాను తమ బృందంలో కలుపుకొంది చిత్ర నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా.


భల్లాలదేవ పాత్రలో నటించిన రానా ప్రచార చిత్రాన్ని బుధవారం రాజమౌళి ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. సినిమాలో రానా ప్రతినాయకుడిగా నటించిన విషయం తెలిసిందే. క్రూరుడైన ఓ రాజుగా ఆయన తెరపై సందడి చేయబోతున్నారు.


అలాగే... 'బాహుబలి' పాటల్ని లహరి మ్యూజిక్‌ ద్వారా విడుదల చేయబోతున్నారు. 'బాహుబలి' తెలుగు, తమిళ పాటలకు సంబంధించిన హక్కుల్ని లహరి మ్యూజిక్‌ సంస్థ చేజిక్కించుకొంది. ''భారతీయ చలన చిత్ర చరిత్రలో నిలిచిపోయే 'బాహుబలి' సినిమా పాటల్ని మా సంస్థ ద్వారా విడుదల చేస్తుండడం ఆనందంగా ఉంద''న్నారు లహరి మ్యూజిక్‌ అధినేత జి.మనోహర్‌నాయుడు.

English summary
Rajamouli's magnum opus ‘Bahubali’ will give huge shock as film makers are planning to hike tickets for the film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu