పవన్ కళ్యాణ్ , ప్రభాస్ ని కూడా ఆపేస్తారా?
హైదరాబాద్: గత వారం రోజుల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలోని వర్కర్స్ యూనియన్ తమ జీతాలను పెంచాలని స్ట్రక్ చేస్తున్న సంగతి తెలిసిందే. దాంతో ఈ స్ట్రైక్ ఎఫెక్ట్ తో ఎక్కడి సినిమాలు అక్కడే ఆగిపోయాయి. గోవాలో ప్రాంభం కావాల్సిన ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ చిత్రం షెడ్యూల్ సైతం ఆగిపోయింది. అయితే రెండు సినిమాలు మాత్రం ఆగలేదని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఒకటి బాహుబలి, రెండు గోపాల గోపాల గోపాల. అయితే ఆ రెండింటినీ కూడా ఆపేస్తారని వినిపిస్తోంది.
రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘బాహుబలి' షూటింగ్ మాత్రం ఆగకుండా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అలాగే పవన్ కళ్యాణ్ - వెంకటేష్ కలిసి నటిస్తున్న ‘గోపాల గోపాల' సినిమా షూటింగ్ కూడా ఆగకుండా రామానాయుడు స్టూడియోస్ లో వేసిన సెట్ లో జరుగుతోంది. అన్ని సినిమాల షూటింగ్ ఆగిపోయినా, ఈ రెండు సినిమాల షూటింగ్ మాత్రం ఆగకుండా ఎలా జరుగుతున్నాయా అని అందరూ ఆశ్యర్యపోతున్నారు. అయితే షూటింగ్ ఆపుచేయాల్సిందిగా బాహుబలి చిత్ర బృందానిక సమాచారం పంపుతున్ట్లు చెప్తున్నారు.

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సోమవారం నుంచి షూటింగ్స్ జరపరాదని తెలుగు ఫిలిం ఫెడరేషన్ నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం నాడు తమ నిర్ణయాన్ని ఓ ప్రకటనలో తెలియజేసింది. సినీ కార్మికుల వేతనాల పెంపు విషయంలో నిర్మాతలకు, ఫెడరేషన్ ప్రతినిథులకు మధ్య కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో ఫిలిం ఫెడరేషన్ ఈ నిర్ణయం తీసుకుందని అధ్యక్షుడు కొమర వెంకటేశ్ పేర్కొన్నారు.
నటీనటులెవరూ ఈ బంద్ కాలంలో చలన చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొనరాదని, ఆ మేరకు సినీ కార్మికులకు సహకరించాలని కోరారు. బంద్ నిర్ణయాన్ని చిత్రపరిశ్రమకు సంబంధించిన వర్గీయులందరికీ ఫ్యాక్స్ ద్వారా తెలియజేస్తున్నామని చెప్పారు. గడచిన నాలుగు రోజులుగా తెలుగు చలన చిత్రాల షూటింగులు జరగడంలేదు.
అయితే కేవలం ‘బాహుబలి', గిన్నిస్ రికార్డ్ కోసం తీస్తున్న ‘సరదాగా ఒక సాయంత్రం' చిత్రాలు ప్రత్యేక అనుమతితో మాత్రమే షూటింగ్ జరుపుకుంటూ వచ్చాయి. తాజా పరిణామాల వల్ల వీటికి కూడా ఆటంకం కలిగే అవకాశం ఉంది. షూటింగ్ నిలుపు చేయాల్సిందిగా ‘బాహుబలి' చిత్రబృందానికి కూడా సమాచారం పంపుతున్నామని కొమర వెంకటేశ్ తెలిపారు.


Click it and Unblock the Notifications











