»   » 'బాహుబలి' టీమ్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు

'బాహుబలి' టీమ్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'బాహుబలి' చిత్రంపై లెక్కకు మించిన అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా...లీక్ లు కామన్ అయ్యిపోయాయి. ఇంతకు ముందు 13 నిమిషాల నిడివిగల బాహుబలి సినిమా లీకైంది. ఇప్పుడు ఏకంగా ఆడియో లో ఆరు పాటలు లీకయ్యాయి. ఈ విషయమై బాహుబలి టీమ్ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీస్ లను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


పూర్తి వివరాల్లోకి వెళితే... రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'బాహుబలి' చిత్రం నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆ సినిమా పాటలు లీకై ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఓవైపు బాహుబలి యూనిట్ ఈనెల 13న తిరుపతిలో ఆడియో విడుదలకు సన్నాహులు చేస్తుంటే మరోవైపు ఆ సినిమా పాటలు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో షేర్ అవుతున్నాయి.


బాహుబలి సినిమాలో మొత్తం 8 పాటలు ఉండగా, వాటిలో ఆరు పాటలు లీక్ అయినట్లు సమాచారం. కాగా పాటలు లీక్ అయినట్లు వాస్తవమేనని చిత్ర యూనిట్ అంగీకరిస్తోంది. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంపై స్పందించేందుకు ముందుకు రావటం లేదు.


Bahubali songs leak confirmed

అలాగే .... ఈ పాటలను ఎవరూ అప్ లోడ్ చేశారనే దానిపై సమాచారం లేదు. కాగా పాటల లీక్ నేపథ్యంలో లహరి సంస్థ ....ఆడియో విడుదల కాకుండానే ఓ పాటను యూట్యూబ్ లో పెట్టడం విశేషం. కాగా లీక్ అయిన పాటలు క్లారిటీ లేనట్లు తెలుస్తోంది. ఇక ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేసిన బాహుబలి పాటల లింక్స్ ను తొలగించే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఇదో పరిష్కారం...


నిన్న టి రోజున వాట్సప్ లో ఈ చిత్రంలోని పాటలు బయిటకు వచ్చేసాయి. దాంతో ఈ పైరసీకు చెక్ పెట్టడానికి బాహుబలి టీమ్ సిద్దమైంది. ఓ ఐడియాతో ముందుకు వచ్చారు. ఇంతుకు ముందు నాగచైతన్య..దోచేయ్ సినిమాకు చేసినట్లే ఈ సారి వీరు కూడా యూట్యూబ్ ద్వారా పైరసీకు చెక్ పెడుతున్నారు. ఇంతకీ ఏంటా ఐడియా...అంటే


జూక్ బాక్స్ లు, ఆన్ లైన్ డౌన్ లోడ్ లు వచ్చాక...సినిమా ఆడియో సీడిలు సేల్స్ చాలా నామినల్ గా మారిపోయాయి. దాంతో..బాహుబలి టీమ్..రోజుకో పాట చొప్పున యూ ట్యూబ్ లో విడుదల చేయాలని నిర్ణయించుకుని ఆ మేరకు ఏర్పాట్లు చేసుకోవటం మొదలెట్టింది. దాంతో బ్యాడ్ క్వాలిటీ సాంగ్స్ బయిటకు రావటం..బ్యాడ్ అవటం ఉండదని భావిస్తున్నారు. ఈ ఆడియో విందామనుకునేవారు...యూ ట్యూబ్ లో వింటారు లేదా ఇంకా క్వాలిటీ కావాలనుకుంటే సీడీలు కొనుక్కుంటారు.ఈ స్టాటజీలోని భాగంగా... బాహుబలి టీమ్ అఫీషియల్ గా తమ చిత్రంలోని 'శివుని ఆన' పూర్తి సాంగ్ ని విడుదల చేసారు. ఈ పాట ఇప్పుడు సినీ ప్రియులను విశేషంగా అలరిస్తోంది.


చిత్రం ఆడియోను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ మైదానంలో ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చిత్రబృందం ట్వీట్టర్‌లో తెలిపింది. ప్రస్తుతం యావత్ భారతదేశ సినీ పరిశ్రమ కళ్ళన్నీ బాహుబలి చిత్రం వైపే వున్నాయి. ఈ సినిమా దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి బాహుబలి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.


ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మహాభారతమే తనకు స్పూర్తినిచ్చిందని తెలిపాడు. ఇదేకాదు దాదాపు తన సినిమాలన్నిటికీ రామాయణ, మహాభారతాలే స్పూర్తని చెప్పుకొచ్చాడు. ఈ రెండు ఇతిహాసాలతో తనకున్న అనుబంధమే దీనికి కారణమని తెలియజేసాడు. బాహుబలి పార్ట్ 1 జులై 10న మనముందుకు రానుంది. బాలీవుడ్ లో కరణ్ జోహార్ సమర్పిస్తున్న ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ నిర్మిస్తుంది.


భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 'బాహుబలి - ది బిగినింగ్‌' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా ఇతర ముఖ్య పాత్రధారులు. ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అంతర్జాలంలో మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే నెల 10న విడుదల చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు.

English summary
'Bahubali' unit is admitting that the songs are leaked and have even complained about it to the Cyber Crime Police.
Please Wait while comments are loading...