బాలయ్యా మజాకా!

బాలయ్య తాజాగా చిత్రం 'అధినాయకుడు'లో ఇద్దరు భామలతో ఘాటు రొమాన్స్ చేస్తున్నారు. లక్ష్మిరాయ్, సలోని ఈ చిత్రంలో బాలయ్యతో ఆట, పాటతో అలరించనున్నారు. ఈచిత్రం తర్వాత బాలయ్య చేస్తున్న సినిమా 'శ్రీమన్నారాయణ'. రవి చావలి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలోనూ బాలకృష్ణ పార్వతి మెల్టన్, ఇషా చావ్లాలతో నటిస్తున్నారు.
త్వరలో బాలయ్య తన గత చిత్రం 'ఆదిత్య 369'కు సీక్వెల్‌గా రూపొందుతున్న 'ఆదిత్య 999'లో నటించబోతున్నారు. సింగితం శ్రీనివాసరావు దర్శకత్వం వహించనున్న ఈచిత్రంలో ఇప్పటికే అనుష్కను లీడ్ హీరోయిన్‌గా తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం మరో ఇద్దరు భామలను కూడా ఈ చిత్రానికి తీసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.
ఆ విషయాలు పక్కన పెడితే...'అధినాయకుడు' చిత్రం మరికొన్ని గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈచిత్రం ట్రైలర్ అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. ఈచిత్రానికి పొలిటికల్ టచ్ ఉన్నట్లు వార్తలు వస్తుండటంతో సినిమాలో ఏముందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


Click it and Unblock the Notifications











