twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్యకు ఆ విషయంలో టెన్షన్ పట్టుకొన్నది...!?

    By Sindhu
    |

    'సింహా" విజయంతో వరస చిత్రాలు చేస్తున్న బాలయ్య ప్రస్తుతం దాసరి దర్శకత్వంలో వస్తున్న 'పరమవీర చక్ర" చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు ఇటీవలే బాలయ్య నటిస్తున్న మరో చిత్రం నానక్‌రామ్‌ గూడలోని రామానాయుడు సినీవిలేజ్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ చిత్రానికి పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్నాడు.

    కాగ బాలకృష్ణ హీరోగా ఆ మధ్యన 'విజయేంద్ర వర్మ" అనే భీభత్సమైన ప్లాప్ చిత్రమొచ్చింది. స్వర్ణ సుబ్బారావు దర్వకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో బాలకృష్ణ మిలిటరీ అధికారిగా కన్సించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. చిన్న పిల్లలు సైతం కామెడీ చేసుకునే యాక్షన్ సన్నివేశఆలు ఆ సినిమాకి ప్రధానమైన మైనస్ లుగా మారాయి. అదంతా గతం..ఇప్పుడేమో మళ్ళీ బాలకృష్ణ మిలిటరీ అధికారిగా కనిపించబోతున్నాడు 'పరమవీర చక్ర" సినిమా కోసం.

    షూటింగ్ టైమ్ లో, బాలయ్య ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నారనీ, యాక్షన్ సన్నివేశాల విషయంలోనూ, అతిగా అన్సించే సన్నివేశాల విషయంలోనూ ఏమాత్రం రాజీపడ్డంలేదనీ బాలయ్య సన్నిహితులు చెప్పుకుంటున్నారు. ఒకటీ అరా సందర్భాల్లో తప్ప, మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో తెలుగు తెరపై బీభత్సమైన విజయాలు సాధించిన చిత్రాలు బహు అరుదేనని చెప్పుకోవాలి. అందుకే 'విజయేంద్రవర్మ" అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, 'పరమవీర చక్ర" సినిమా కోసం బాలయ్య తీసుకుంటున్న జాగ్రత్తలు ఏ మేరకు వర్కవుట్ అవుతాయో సినిమా విడుదలయ్యేదాకా చూడాల్సిందే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X