పరమవీర చక్రలో బాలకృష్ణ స్పెషాలిటీ అదే..
బాలకృష్ణ,దాసరి నారాయణ రావు కాంబినేషన్లో రూపొందుతున్న పరమవీరచక్ర చిత్రంలో రకరకాల గెటప్స్ లో బాలకృష్ణ కనిపించనున్నారని సమాచారం. తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్..వేసిన వేటగాడు, సర్దార్ పాపారాయుడు, అడవిరాముడు పాత్రల గెటప్స్ ని బాలయ్య వేస్తున్నాడని తెలుస్తోంది. అలాగే రావణా బ్రహ్మ గెటప్ లో కూడా బాలకృష్ణ కనిపించనున్నారు. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ. దేశం కోసం ప్రాణం పెట్టే ఆర్మీ మేజర్ గానూ, నిజ జీవిత పాత్ర అయిన సినీ నటుడు గానూ కనిపిస్తారు. అలాగే ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన షీలా, నేహా ధూపియా, అమీషా పటేల్ చేస్తున్నారు. సింహా ఘన విజయం తర్వాత కమిటయిన ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది.
దాసరి నారాయణ రావు బాలకృష్ణ షీలా నేహా ధూపియా అమీషా పటేల్ పరమవీర చక్ర dasari narayana rao balakrishna sheela amisha patel parama veera chakra


Click it and Unblock the Notifications