Devara Vs NBK 109: ఎన్టీఆర్‌కు బాలయ్య బిగ్ షాక్.. టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న క్రేజీ న్యూస్

తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీనికి కారణం.. ఆ కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలుగా పరిచయం కావడమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ పలువురు హీరోలు స్టార్లుగానూ హవాను చూపిస్తున్నారు.

వారిలో నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ బడా స్టార్లుగా సత్తా చాటుతోన్నారు. వీళ్లిద్దరూ వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌కు బాలయ్య బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏం జరిగింది? ఆ పూర్తి వివరాలను మీరే చూడండి మరి!

Balakrishna 109 Movie Release Before Week of Jr NTR Devara Coming

వరుస హిట్లతో ఫామ్‌లో బాలయ్య: నటసింహా నందమూరి బాలకృష్ణ ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నారు. 'అఖండ'తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఆయన.. ఈ ఏడాది ఆరంభంలో 'వీర సింహా రెడ్డి' అంటూ వచ్చి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఈ ఊపులోనే ఇటీవలే బాలయ్య 'భగవంత్ కేసరి' మూవీని చేశారు. ఇది కూడా సక్సెస్ అవడంతో హ్యాట్రిక్ నమోదు అయింది.

Balakrishna 109 Movie Release Before Week of Jr NTR Devara Coming

ఎన్టీఆర్ ఖాతాలోనూ బోలెడన్ని: చాలా కాలం పాటు వరుస ఫ్లాపులతో సతమతం అయిన ఎన్టీఆర్.. 'టెంపర్'తో హిట్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి ఏకధాటిగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. అందుకు తగ్గట్లుగానే హిట్లు మీద హిట్లను కొడుతున్నాడు. దీనికితోడు RRR మూవీతో ఎన్టీఆర్ రేంజ్ అమాంతం పెరిగింది. దీనితో అతడు గ్లోబల్ స్టార్‌గానూ మారిపోయాడు. ఫలితంగా మరింత ఉత్సాహంతో వెళ్తున్నాడు.

పాన్ ఇండియా మూవీలో తారక్: వరుస హిట్లతో కెరీర్‌లోనే భీకరమైన ఫామ్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు బడా డైరెక్టర్ కొరటాల శివతో కలిసి 'దేవర' అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో రాబోతున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది. మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కే ఈ సినిమా మొదటి పార్టును ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.

Balakrishna 109 Movie Release Before Week of Jr NTR Devara Coming

ఆ సినిమా చేస్తున్న బాలకృష్ణ: హ్యాట్రిక్ విజయాలతో జోష్ మీదున్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమాను చేస్తున్నారు. నేడే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. 1980 బ్యాగ్‌డ్రాప్‌లో డిఫరెంట్ కాన్సెప్టుతో రాబోయే ఈ సినిమాను బిగ్ స్కేల్‌పై తీస్తున్నారు. దీన్ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేసి సమ్మర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

బాలయ్య సినిమా రిలీజ్ ఫిక్స్: నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను సమ్మర్‌లో రిలీజ్ చేస్తారని ఇప్పటికే న్యూస్ లీకైంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీని వచ్చే ఏడాది మార్చి 29న రిలీజ్ చేస్తున్నారట. మార్చి 28వ తేదీతో 'లెజెండ్' మూవీ వచ్చి పది సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భంగానే బాలయ్య సినిమా కోసం ఆ డేట్‌నే ఫిక్స్ చేశారని టాక్.

Balakrishna 109 Movie Release Before Week of Jr NTR Devara Coming

ఎన్టీఆర్ మూవీకి షాకిచ్చాడుగా: బాలయ్య సినిమాను 2024 మార్చి 29న రిలీజ్ చేస్తున్నారన్న న్యూస్ ఇప్పుడు టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. దీనికి కారణం ఏప్రిల్ 5వ తేదీన అంటే వారం తర్వాతనే 'దేవర' సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పుడు బాలయ్య మూవీ 29న వస్తే ఈ రెండు సినిమాలకూ క్లాష్ వస్తుంది. అదే జరిగితే ఎన్టీఆర్‌కు బాబాయి బిగ్ షాక్ ఇచ్చినట్లు అవుతుంది అనడంలో సందేహం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X