'వీరభధ్ర' దర్శకుడుతో మరోసారి బాలయ్య?
బాలకృష్ణ,కె.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో 'వీరభద్ర' అనే చిత్రం వచ్చి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అదే దర్శకుడుతో బాలయ్య సినిమా చేయటానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. రవికుమార్ చెప్పిన స్టోరీ విని ఇంప్రెస్ అయిన బాలయ్య వెంటనే డేట్స్ కేటాయిస్తానని చెప్పారని చెప్పుకుంటున్నారు. 'వీరభద్ర' సినిమా ఫ్లాప్ అయినా తనని బాగా ఎలివేట్ చేసారని బాలయ్య నమ్మకంతో ఈ ప్రాజెక్టుకు కమిట్ అయ్యారని తెలుస్తోంది. నిర్మాతగా పోకూరి బాబూరావు ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉంది. అందులోనూ అంతకుముందు రవికుమార్ ఆ బ్యానర్ పై 'యజ్ఞం' వంటి సూపర్ హిట్ ఇచ్చాడు. ఈ చిత్రానికి సంభందించిన స్క్రిప్టు వర్క్ పూర్తయింది. బాలకృష్ణ తాజాగా చేస్తున్న 'సింహా' అనంతరం ఈ కొత్త చిత్రం ఉండే అవకాశం ఉంది. తులసి,భద్ర వంటి హిట్స్ ఇచ్చిన బోయపాటి శీను ..ఈ 'సింహా' చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. నయనతార, స్నేహ ఉల్లాల్,నమిత హీరోయిన్స్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.


Click it and Unblock the Notifications











