Don't Miss!
- News ముస్లీం రిజర్వేషన్లపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, మేము వస్తే ఖేల్ కథం !
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్‌పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
బాలకృష్ణ, బన్నీ మరో వాయిదా.. కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్న కొత్త రూమర్స్?
లాక్ డౌన్ అనంతరం దేశంలో మరెక్కడా లేని విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు సందడి చేశాయి. ముఖ్యంగా రిలీజ్ డేట్స్ విషయంలో ఒకరి తరువాత మరొకరు పోటాపోటీగా ఎనౌన్స్ చేశారు. వీలైనంత వరకు బాక్సాఫీస్ వద్ద ప్రభావం పడేంత పోటీలు లేకుండా చూసుకుంటున్నారు. అయితే అనుకున్న సమయానికి బాలకృష్ణ, బన్నీ రావడం అనుమానమేనని సోషల్ మీడియాలో రూమర్లు వస్తున్నాయి.
ఎన్టీఆర్ ద్వారా ఫస్ట్ లుక్
బాలకృష్ణ బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో రాబోతున్న మాస్ మసాలా యాక్షన్ మూవీ కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఉగాది సందర్భంగా ఎన్టీఆర్ ద్వారా సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది.
రిలీజ్ డేట్ లో మార్పులు?
ఇక సినిమాను 28న రిలీజ్ చేయాలని ముందే ప్లాన్ చేసుకున్న చిత్ర యూనిట్ మొత్తానికి అభిమానుల కన్ఫ్యూజన్ క్లియర్ చేసింది. అయితే ఇప్పుడు ఆ డేట్ కు రావడం అనుమానమే అనే కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే షూటింగ్ ఎంత స్పీడ్ గా ఫినిష్ చేసినా కూడా అప్పటిలోపు పూర్తవ్వదట. అందుకే షూటింగ్ తేదీని మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
కరోనా ఎఫెక్ట్..
ఇక సుకుమార్ , అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోతున్న పుష్ప పరిస్థితి కూడా అలానే ఉంది. ఈ సినిమాను ఆగస్ట్ 13న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. కానీ కరోనా కారణంగా సినిమా షూటింగ్ కు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో కంటే ఎక్కువ స్థాయిలో ఇప్పుడు కరోనా కేసులు. పెరుగుతుండడంతో సుకుమార్ టీమ్ జాగ్రత్తలు తీసుకుంటోంది.
పుష్ప కొత్త డేట్?
పుష్ప షూటింగ్ ను ఎంత త్వరగా పూర్తి చేసినా కూడా ప్రీ ప్రొడక్షన్ పనులకు చాలా సమయం పడుతుందట. మరో నెల రోజుల ఎక్కువ సమయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పుష్ప వాయిదా పడితే సెప్టెంబరు లోనే ఏదో ఒక డేట్ ను ఫిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ తరువాత అక్టోబర్ లో RRR రాబోతున్న విషయం తెలిసిందే. మరి సుకుమార్ టీమ్ ఎలాంటి ప్లాన్ వేస్తుందో చూడాలి.