NBK108: బాలయ్య సినిమా రిలీజ్ డేట్ ఇదే.. పోటీగా మరో మూడు చిత్రాలు
ఒకవైపు ఏజ్ పెరుగుతున్నా ఏమాత్రం వెనకడుగు వేయకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. కెరీర్ ఆరంభం నుంచీ హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న ఆయన.. 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత మరింత జోష్‌తో కనిపిస్తున్నారు.
ఈ ఉత్సాహంతోనే ఈ సంక్రాంతికి గోపీచంద్ మలినేని తెరకెక్కించిన 'వీరసింహారెడ్డి' అనే సినిమాతో వచ్చారు. దీనికి కూడా భారీ స్పందన దక్కింది. ఫలితంగా ఇది అత్యధిక కలెక్షన్లను వసూలు చేయడంతో పాటు హిట్ అయింది.

వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న బాలయ్య తన 108వ సినిమాను సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇలా ఇప్పటికే దాదాపు 90 శాతం వరకూ టాకీ పార్టును చిత్ర యూనిట్ కంప్లీట్ చేసుకుంది.
మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా దర్శకుడు అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడు. ఇలా ఎలాగైనా దీన్ని అనుకున్న సమయానికి తీసుకు వచ్చేలా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ రిలీజ్ డేట్‌పై తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
మాస్ ఎంటర్‌టైనర్‌గా ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను ఈ ఏడాది దసరా పండుగ కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ ఎప్పుడో డిసైడ్ అయింది. అందుకు అనుగుణంగానే ఈ విషయాన్ని ప్రకటించారు. ఇక, ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా బయటకు వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం.. దీన్ని అక్టోబర్ 20న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తారట. ఈ విషయాన్ని టైటిల్ పోస్టర్‌లో రివీల్ చేస్తారని తెలిసింది. ఇక, అదే రోజున రవితేజ 'టైగర్ నాగేశ్వర్రావు', రామ్ పోతినేని - బోయపాటి శ్రీను సినిమా, విజయ్ 'లియో' మూవీలు రాబోతున్నాయి.
ఇదిలా ఉండగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటిస్తోన్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. యంగ్ సెన్సేషన్ శ్రీలీల కీలక పాత్రలో నటిస్తుంది. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ మూవీకి 'భగవంత్ కేసరి' అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తున్నారని ఇప్పటికే న్యూస్ లీకైంది.


Click it and Unblock the Notifications











