అనిల్ రావిపూడికి బాలయ్య షాక్.. చివరి నిమిషంలో మార్చేసిన నందమూరి హీరో

సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో హవాను చూపిస్తూ.. స్టార్ హీరోగా దూసుకుపోతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. కెరీర్ ఆరంభం నుంచి హిట్లు ఫ్లాపులను ఏమాత్రం బేరీజు వేసుకోకుండా వరుసగా సినిమాలు చేస్తోన్న ఆయన.. ఎన్నో విజయాలను కూడా ఖాతాలో వేసుకుని సత్తా చాటారు. ఈ క్రమంలోనే ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను పెంచుకుంటూనే వస్తున్నారు. ఇక, చాలా కాలంగా సక్సెస్ లేక ఇబ్బందులు పడిన బాలయ్య.. గత ఏడాది వచ్చిన 'అఖండ'తో ఆయన మరోసారి హిట్ ట్రాక్ ఎక్కడంతో పాటు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సక్సెస్‌ను సొంతం చేసుకున్నారు.

'అఖండ' సక్సెస్ ఇచ్చిన జోష్‌లో ఉన్న నటసింహా నందమూరి బాలకృష్ణ.. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'వీరసింహారెడ్డి' అనే సినిమాను చేస్తున్నారు. ఇది షూటింగ్ జరుపుకుంటూ ఉండగానే ఆయన సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడితోనూ ప్రాజెక్టుకు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ కోసం నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక, అనిల్ రావిపూడి ఈ మూవీ కోసం తొలిసారి కామెడీకి ప్రాధాన్యత తగ్గించి ఓ పవర్‌ఫుల్ సబ్జెక్టును రెడీ చేసిన్నట్లు స్వయంగా ఆయనే ప్రకటించాడు.

Balakrishna and Anil Ravipudi Movie Starts Delay

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రం గురించి తాజాగా ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. వాస్తవానికి ఈ సినిమాను నవంబర్ మొదటి వారంలోనే పట్టాలెక్కిస్తారని ప్రచారం జరిగింది. కానీ, అలా జరగలేదు. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి మొదలు పెట్టాలని బాలయ్య.. అనిల్ రావిపూడికి సూచించారట. అప్పటి వరకూ తన 'వీరసింహారెడ్డి' సినిమా ప్రమోషన్ కార్యక్రమాలపై ఫోకస్ చేస్తానని ఆయన చెప్పినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దీనికి అనిల్ కూడా ఓకే చెప్పినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.

బాలయ్య - అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న ఈ మూవీలో అంజలి, ప్రియమణి కీలక పాత్రలను చేస్తున్నారని అంటున్నారు. అలాగే, శ్రీలీలా.. బాలయ్య కూతురిగా నటించబోతుందట. దీనికి 'రామారావు గారు' అనే టైటిల్ పెడుతున్నట్లు తెలిసింది. దీంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు ఏర్పడ్డాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X